Tips for Protect Their Babies From Dengue: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగ్యూ(Dengue) విజృంభిస్తోంది. దేశ రాజధాని డిల్లీ(Delhi)లో గత ఆరు నెలల్లోనే 3 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది కంటే ఈసారి రికార్డు స్థాయిలో నమోదైన కేసుల కారణంగా భారతదేశంలో డెంగ్యూ ఆందోళన మరింత పెరిగింది. 2022లో భారతదేశంలో దాదాపు 2.3 లక్షల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2000 - 2012 మధ్య 13 సంవత్సరాలలో నమోదైన మొత్తం డెంగ్యూ కేసుల కంటే చాలా ఎక్కువ. డెంగ్యూ ఏడిస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒళ్లు నొప్పులు, వికారం వంటి సమస్యలు వస్తాయి. పిల్లలు, ముఖ్యంగా శిశువులు డెంగ్యూ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి సరిగా ఉండదు. ఎప్పుడూ డెంగ్యూ జ్వరం రాని తల్లులకు పుట్టిన శిశువులకు కూడా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూ జ్వరం నుండి తమ నవజాత శిశువులను, పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఆ సూచనలు ఏంటో ఓసారి చూద్దాం.
పిల్లలు డెంగ్యూ భారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు..
1. తల్లిదండ్రులు తమ నవజాత శిశువును, పిల్లలను దోమతెర సహాయంతో రక్షించుకోవచ్చు. అది దోమల నుంచి పిల్లలను కాపాడుతుంది.
2. తల్లిదండ్రులు తమ పిల్లలు నిండు చేతుల దుస్తులతో సరిగ్గా కప్పబడి ఉండేలా చూసుకోవాలి.
3. దోమ కాటు నుండి రక్షణ కల్పించే అనేక ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పిల్లల చర్మానికి అనువైన దోమల నివారణ మందులను వైద్యుల సూచన మేరకు వాడవచ్చు.
4. తల్లిదండ్రులు వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం తర్వాత పిల్లలను బయటకు తిప్పుకుండా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో డెంగ్యూ దోమలు ఎక్కువ చురుకుగా ఉంటాయి. దోమలు సాధారణంగా తీవ్రమైన కాంతి, తీవ్రమైన చలి, గాలులతో కూడిన పరిస్థితులను ఇష్టపడవు. అందుకే.. ఈ సమయాల్లో అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి.
5. ప్రజలు తమ ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కుండలు, పాత్రలు, టైర్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
6. దోమల వృద్ధికి కారణమయ్యే వాటిని తొలగించాలి.
7. సాధారణంగా పిల్లల్లో డెంగ్యూ జ్వరం లక్షణాలు తేలికపాటి నుండి మధ్యస్థంగా ఉంటాయి. తల్లిదండ్రులు ఈ లక్షణాల గురించి తెలుసుకోవాలి. వెంటనే వారిని వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. చికిత్స ఆలస్యమైతే.. పిల్లల ఆరోగ్యంపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది.
సాధారణ డెంగ్యూ లక్షణాలు:
1. జ్వరం
2. వాంతులు
3. నిద్ర ఆటంకాలు
4. చిగుళ్ళలో రక్తస్రావం (చిగుళ్ళు లేదా ముక్కు)
5. చర్మం దద్దుర్లు
6. అధిక నీరసం
Also Read:
TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!