/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Pravalika-Boy-Friend-jpg.webp)
Pravalika Suicide Case: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక(Pravalika) ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రవళిక ఆత్మహత్యకు కారణం అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె స్నేహితుడు ఆచూకీ లభించింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రవళిక ఆత్మహత్య ఘటన నుంచి అజ్ఞాతంలో ఉన్న శివరామ్ రాథోడ్ ఆచూకీని పోలీసులు కనిపెట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ కేసులో అతన్ని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఓ హాస్టల్‌లో ఉంటున్న ప్రవళిక తన గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. వరంగల్‌కు చెందిన ప్రవళిక గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. అయితే, ఏమైందో తెలియదు గానీ.. రాత్రి సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రూప్స్ పరీక్షలు వాయిదా పడటం వల్లే ప్రవళిక చనిపోయిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ పార్టీలు సైతం యువతి ఆత్మహత్యకు కారణం ప్రభుత్వమే అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.
ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..
అయితే, ప్రవళిక మృతిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ప్రేమ వ్యవహారమే ప్రవళిక మృతికి కారణం అని నిర్ధారించారు. శివరామ్ రాథోడ్ అనే యువకుడు వేధింపుల కారణంగా ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. యువతి తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. తమ బిడ్డ ఆ యువకుడి వేధింపుల వల్లే చనిపోయిందని ఆరోపించారు. అయితే, యువతి ఆత్మహత్య వార్త బయటకు వచ్చింది మొదలు ఇప్పటి వరకు ఆ యువకుడు అజ్ఞాతంలో ఉండిపోయాడు. తాజాగా శివరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంలో ఎలాంటి మలుపు చోటు చేసుకుంటుందో చూడాలి.
ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..