Chicken Prices: చికెన్‌ ప్రియులకు షాక్‌..భారీగా పెరిగిన ధరలు!

కార్తీక మాసం ముగియడంతో నాన్‌ వెజ్‌ ప్రియులందరూ చికెన్‌ షాపుల ముందు క్యూ కట్టారు. డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులు ధరలను ఒక్కసారిగా పెంచేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి వరకు రూ. 130 నుంచి 180 వరకు ఉన్న ధరలు ఈరోజు ఒక్కసారిగా 220 నుంచి 260 కి పెరిగాయి.

New Update
Chicken Prices: చికెన్‌ ప్రియులకు షాక్‌..భారీగా పెరిగిన ధరలు!

కార్తీక మాసం (Karthikamasam)  అయిపోయింది..నిన్నటి వరకు 130 లకే అందుబాటులో ఉన్న చికెన్‌ ఇప్పుడు ఒక్కసారిగా డబుల్ అయ్యింది. కార్తీక మాసం ముగియడంతో మాంసం ప్రియులు చికెన్‌ షాపుల ముందు క్యూలు కట్టారు. దీంతో చికెన్‌ (Chicken) ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం నుంచే చికెన్‌ షాపుల ముందు బారులు తీరారు మాంసం ప్రియులు.

ఎలాగు మటన్ కొనే పరిస్థితుల్లో సామాన్యుడు లేడు. ఇక ఉన్నది చికెన్‌. అది కూడా ఇప్పుడు ధరలు పెరగడంతో కేజీ కొనాల్సిన చోట అరకేజీకే పరిమితం అవుతున్నారు. కార్తీక మాసం ముగియడంతో పాటు పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. అంతే కాకుండా క్రిస్టమస్‌, న్యూయర్‌ పండుగలు కూడా ముందు ఉండడంతో చికెన్‌ ని విపరీతంగా కొంటారు.

నిన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కిన్‌ లెస్‌ కిలో 180 రూపాయలు అమ్మగా..ఈరోజు 260 రూపాయలకు అమ్ముతున్నారు. స్కిన్‌ తో నిన్నటి వరకు 130 రూపాయలు పలికిన చికెన్‌ నేడు ఒక్కసారిగా 220 లకి చేరుకుంది. ఒక్కసారిగా 70 నుంచి 80 రూపాయలు పెరగడంతో
మాంసం ప్రియులు షాక్‌ అయ్యారు.

నాన్‌ వెజ్‌ ప్రియుల డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో చికెన్‌ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ కాలంలో మాంసం వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో చికెన్‌ ధరలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కార్తీక మాసం ముగిసిన తరువాత మొదటి ఆదివారం కావడంతో చికెన్‌ షాపులు కిటకిటలాడుతున్నాయి.

ఇదిలా ఉంటే కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. దీంతో సామాన్యులు చికెన్‌ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. రేట్లు పెరిగినప్పటికీ ఆదివారం ముక్క లేనిదే ముద్ద దిగదు.దీంతో కొనక తప్పని సరి పరిస్థితులని ప్రజలు అంటున్నారు.

Also read: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ నెల 21 నుంచి..

Advertisment
తాజా కథనాలు