Winter: శీతాకాలంలో మనల్ని రక్షించే చియా విత్తనాలు

మన ఆరోగ్యానికి చియా విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి.చియా గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని, రక్తంలో చక్కెర స్థాయిలను , గుండె జబ్బులు, ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతో దోహదపడతాయి.

New Update
Winter: శీతాకాలంలో మనల్ని రక్షించే చియా విత్తనాలు

Winter: చియా విత్తనాలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొందరు వ్యాయామాలు చేసి ఫిట్‌గా ఉంటే, మరికొందరు ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా శీతాకాలంలో కొన్ని ప్రత్యేక ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. శీతాకాలం తప్పకుండా తినాల్సిన ఆహారంలో చియా విత్తనాలు కీలకం. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. చియా విత్తనాలను సల్బా చియా, మెక్సికన్ చియా అని కూడా పిలుస్తారు. చియా విత్తనాల తింటే కలిగే 7 ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి

  • చియా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి ఆక్సీకరణ, కణాలను దెబ్బతీస్తాయి.

పోషకాలు అధికం

  • చియా గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సంవృద్ధిగా ఉంటాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

  • చియా విత్తనాలలో క్వెర్సెటిన్ ఉంటుంది, ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను నియంత్రిస్తాయి

  • చియా విత్తనాలలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది.

బరువు నియంత్రణలో ఉంటుంది

  • బరువు తగ్గించుకోవాలనుకునే వారికి చియా విత్తనాలు ఒక గొప్ప ఎంపిక. వీటిలోని ఫైబర్‌ మన కడుపును నిండుగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల ఎక్కువగా తినకుండా ఉంటాం.

ఎముకలు బలంగా మారుతాయి

  • చియా గింజలు మెగ్నీషియం, కాల్షియం మరియు ఫాస్పరస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి ఎముకల ఆరోగ్యానికి దోహదపడతాయి.

జీర్ణక్రియను మెరుగుపడుతుంది

  • కరిగే మరియు కరగని ఫైబర్స్ రెండూ చియా గింజల్లో ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

ఇది కూడా చదవండి:అతిగా మద్యం సేవిస్తే కలిగే దుష్ప్రభావాలు ఇవే

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు