Encounter: మరో మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంటర్!

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కాల్పుల్లో 9 మంది చనిపోయారు. మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Encounter: మరో మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంటర్!
New Update

Maoist: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. మంగళవారం అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబు.. అలియాస్ జగన్ (రణదేవ్ దాదా) మృతి చెందినట్లు తెలుస్తోంది. కేంద్ర మిలిటరీ ఇన్‌చార్జ్ తోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ బార్డర్ ఇన్‌చార్జ్‌గా రణదేవ్ పనిచేస్తున్నారు. రణదేవ్ స్వస్థలం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం. జగన్‌పై ఇప్పటికే రూ. 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జగన్‌తో పాటు మరో ఎనిమిది మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

చనిపోయిన మావోయిస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:

1. రణదేవ్.. పోస్ట్ DKSZCM. వరంగల్ నివాసి. రివార్డు-25 లక్షలు.

2. కుమారి శాంతి. పోస్ట్- 31 PL సభ్యులు. రివార్డు- 05 లక్షలు

3. సుశీల మడకం, భర్త జగదీష్. పోస్ట్- ACM. రివార్డు- 05 లక్షలు.

4. గంగి ముచకి, హోదా- కాటేకల్యాణ్. ఏరియా కమిటీ సభ్యుడు. రివార్డు-05 లక్షలు.

5. కోసా మాద్వి, హోదా- మలంగిర్. ఏరియా కమిటీ పార్టీ సభ్యుడు. రివార్డు- 05 లక్షలు.

6. లలిత. పోస్ట్- DVCM సురక్షా దళ్ సభ్యుడు. రివార్డు- 05 లక్షలు.

7. కవిత. పోస్ట్ గార్డ్ ఆఫ్ AOBSZC. రివార్డు- 05 లక్షలు.

8. హిడ్మే మంకం. DVCM సురక్షా దళ్ సభ్యుడు. రివార్డు – 02 లక్షలు

9. కమలేష్. ప్లాటూన్ సభ్యుడు. బీజాపూర్ నివాసి. రివార్డ్ -2 లక్షల

#encounter-chhattisgarh #9-maoists-killed
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe