Chess World Cup: కార్ల్‌సెన్‌ని గడగడలాడించిన ప్రజ్ఞానంద.. కానీ ప్చ్.. ఓటమి.. బ్యాడ్‌లక్! ప్రజ్ఞానంద ఓడిపోయాడు.. ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ ఫైనల్‌లో మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. టైమ్ ఎక్కువ వృధా చేయడం ప్రజ్ఞానందకు మైనస్ అయ్యింది. తన అనుభవాన్నంతా రంగరించిన చెస్ దిగ్గజం కార్ల్‌సెన్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. By Trinath 24 Aug 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Chess World Cup final: చివరి నిమిషం వరకు అదే ఉత్కంఠ.. 31ఏళ్ల చెస్ చాంపియన్ కార్ల్‌సెన్‌ని 18ఏళ్ల చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద గజగజ వణికించాడు. చెస్ చాంపియన్ ఫైనల్ టై బ్రేక్‌లో కార్ల్‌సెన్ ఆధిపత్యం చలాయించినా ప్రజ్ఞానంద మాత్రం వెనక్కి తగ్గలేదు. కార్ల్‌సెన్‌ని ముప్పుతిప్పలు పెట్టాడు. అత్యంత వేగంగా.. తెలివిగా మూవ్స్ చేసే కార్ల్‌సెన్‌ని ఉక్కిరిబిక్కిరి చేశాడు ప్రజ్ఙానంద. నిజానికి మ్యాచ్ మొదలైన టైమ్‌లో ప్రజ్ఞానంద ఓ రాంగ్ మూవ్ చేశాడు. కార్ల్‌సెన్ తన లైట్-స్క్వేర్డ్ బిషప్‌తో తీసిన తన నైట్‌ని f5కి పెట్టడంలో ప్రాగ్ పెద్ద తప్పు చేశాడు. అయినా ప్రజ్ఙానంద కాసేపటికే మళ్లీ లీడ్‌లోకి వచ్చాడు. అయితే ప్రజ్ఞానంద మూవ్స్ కోసం టైమ్ ఎక్కువ తీసుకోవడంతో మళ్లీ డిఫెన్స్‌లో పడిపోయాడు. చివరకు కార్ల్‌సెన్‌నే విజయం వరించింది. 🏆 Magnus Carlsen is the winner of the 2023 FIDE World Cup! 🏆 Magnus prevails against Praggnanandhaa in a thrilling tiebreak and adds one more prestigious trophy to his collection! Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/sUjBdgAb7a — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 ప్రజ్ఙానందపై మాగ్నస్ కార్ల్‌సెన్ మొదటి 25+10 గేమ్‌లో గెలిచాడు! Praggnanandhaa is the runner-up of the 2023 FIDE World Cup! 🥈 Congratulations to the 18-year-old Indian prodigy on an impressive tournament! 👏 On his way to the final, Praggnanandhaa beat, among others, world #2 Hikaru Nakamura and #3 Fabiano Caruana! By winning the silver… pic.twitter.com/zJh9wQv5pS — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 ప్రజ్ఙానంద తుదిమెట్టుపై ఓడిపోయినా ఇది గెలుపుగానే భావించవచ్చు. కార్ల్‌సెన్ లాంటి ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్‌ని ముప్పుతిప్పలు పెట్టడం చిన్న విషయం కాదు. అలాంటిది టై బ్రేకర్ వరకు ప్రజ్ఙానంద తీసుకొచ్చాడు. అది కూడా అతి చిన్న వయసులో.. కార్ల్‌సెన్ 19ఏళ్లకే వరల్డ్ నంబర్ వన్ పిఠంపై కుర్చున్నాడు. ఇప్పుడు ప్రజ్ఞానంద వయసు 18ఏళ్లు. ప్రజ్ఞానంద ఆటతీరు చూస్తుంటే త్వరలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఈజీగానే కనిపిస్తోంది. The last moments as @MagnusCarlsen wins the 2023 #FIDEWorldCup, "the final feather in his cap"! pic.twitter.com/bCgb7BRSXp — chess24.com (@chess24com) August 24, 2023 #chess-world-cup-final #praggnanandhaa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి