రెండో గేమ్ కూడా డ్రా.. ఇక టై బ్రేక్‌లోనే.. సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో ప్రజ్ఞానంద

ఓవైపు చంద్రయాన్-3 సక్సెస్‌తో సంబరాల్లో ఉన్న భారతీయులకు మరో మధురమైన విజయం అందించేందుకు ఓ భారతీయుడు సిద్ధమయ్యాడు. జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెడితే.. ప్రపంచ చెస్ పీఠంపై పాదం మోపడానికి రెడీ అయ్యాడు. చదరంగం ఆటలో రాజుగా అవతరించేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.

రెండో గేమ్ కూడా డ్రా.. ఇక టై బ్రేక్‌లోనే.. సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో ప్రజ్ఞానంద
New Update

రాజు అయ్యేందుకు అడుగు దూరమే..

ఓవైపు చంద్రయాన్-3 సక్సెస్‌తో సంబరాల్లో ఉన్నవారికి మరో మధురమైన విజయం అందించేందుకు ఓ భారతీయుడు సిద్ధమయ్యాడు. జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెడితే.. ప్రపంచ చెస్ పీఠంపై పాదం మోపడానికి రెడీ అయ్యాడు. చదరంగం ఆటలో రాజుగా అవతరించడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అతడే గ్రాండ్ మాస్టర్‌ ప్రజ్ఞానంద. ఫిడే చెస్ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌తో జరుగుతున్న తుది సమరంలో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నాడు. మొదటి గేమ్ డ్రా కాగా.. రెండో గేమ్ కూడా డ్రా అయింది. దీంతో గురువారం టై బ్రేక్ ద్వారా భారతీయుల గుండెలు మరోసారి ఉప్పొంగేలా గర్వంగా కాలు దువ్వుతున్నాడు.

టై బ్రేక్‌లోనే విజేత నిర్ణయం.. 

మొద‌టి మ్యాచ్‌లో 35 ఎత్తుల త‌రువాత ఇద్ద‌రు పంపు డ్రాకు అంగీక‌రించ‌గా.. బుధవారం జ‌రిగిన రెండో గేమ్‌లోనూ 30 ఎత్తుల త‌రువాత డ్రాకు సిద్ధ‌మయ్యారు. దీంతో టై బ్రేక్ జరగనుంది. అజర్ బైజాన్ రాజధాని బకూ వేదికగా జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో గొప్ప గొప్ప గ్రాండ్ మాస్టర్లంతా ఉంది. అయితే వీరిందరిని వెనక్క నెట్టి కేవలం 18 ఏళ్ల వయసులోనే ఫైనల్ చేరాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథ‌న్ ఆనంద్ త‌రువాత ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టిన రెండో భార‌త ఆట‌గాడిగా ప్ర‌జ్ఞానంద రికార్డు సృష్టించాడు. అంతేకాదు బాబీ ఫిషర్, కార్ల్‌సన్ వంటి దిగ్గజాల తర్వాత అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన గ్రాండ్ మాస్టర్‌గానూ నిలిచాడు. వచ్చే ఏడాది జరగబోయే కేండిడేట్స్ టోర్నీకి కూడా ప్రజ్ఞానంద అర్హత సాధించాడు.

సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధం.. 

ఇక సెమీస్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్, అమెరికన్ సూపర్ గ్రాండ్ మాస్టర్ ఫ్యాబియానో ​​కురునాపై సంచలన విజయం సాధించాడు. రేపు జరిగే టై బ్రేక్‌లో కార్ల్‌సన్‌ను ఓడించి విజయం సాధిస్తే చెస్‌ వరల్డ్‌ కప్‌ గెలిచిన యంగెస్ట్‌ ఇండియన్‌ గ్రాండ్‌ మాస్టర్‌గా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టిస్తాడు. గతంలో జరిగిన ఓ టోర్నీలోనూ ప్రజ్ఞానంద.. కార్ల్సన్‌ను ఓడించాడు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe