చౌవకబారు విమర్శలు వద్దు
ఈ లేఖలో ప్రతిపక్షాలపై రాజశేఖర్‌రెడ్డి చేసే విమర్శలు చాలా హుందాగా ఉండేవనీ, రాజశేఖర్‌రెడ్డిలో వున్న హుందా తనం జగన్‌లో 10వ వంతు కూడా లేదని ప్రస్తావించారు. అంతేకాకుండా అప్పట్లో రాజశేఖరరెడ్డిని విమర్శించిన ఆ తరువాత తన అభిమానిగా మారిపోయానని పేర్కొన్నారు. పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లిల్ల గురించి చౌవకబారు విమర్శలు చేయడం మానుకోవాలనీ, చట్ట ప్రకారం విడాకులు తీసుకున్న వారు మరో వివాహం చేసుకోవచ్చనీ వారు ఈలేఖలో పెర్కొన్నారు.
పాలక పక్షం స్పందన ఏంటో..?
అయితే అసలు పవన్ కళ్యాణ్ పెళ్లిల్లపై ప్రజలకు లేని అభ్యంతరం జగన్‌కు ఎందుకని వారు ప్రశ్నించారు. ఇకనైనా ఇలాంటి చౌవకబారు విమర్శలు చేయడం మానేయాలని వారు హితవు పలికారు. అసలు పవన్ కళ్యాణ్‌ను విమర్శించడానికి ఇంకో అంశం ఏదీ లేనందునే ఇలాంటి అనవసరమైన విషయాలను పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మీపైన ఉన్న కేసులలో మీరు దోషిగా తేలితే తర్వాత సీఎం ఎవరంటూ ఈ లేఖలో ఆయన ప్రస్తావించారు. జగన్‌ను గతంలో కూడా అనేక అంశాలలో విమర్శిస్తూ చేగొడి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లేఖపై పాలక పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇలా మాట్లాడటం నా నైజం
ఇకముందు ప్రతిపక్ష నాయకులపై ముఖ్యంగా పవన్ పై అనవసరమైన దుర్భాషలాడటం మానుకొంటే బాగుపడ్తారని సున్నితంగా హెచ్చరించారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవటం ఏ సలహాదారు నేర్పారు మీకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు కూతలు మీతో మాట్లాడించి మిమ్మల్ని ముంచటానికే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకుంటానికి ప్రయత్నం చేసుకోండని హితవు పలికారు. మీపై ఈ అభియోగాలు మోపవలసిన పరిస్థితి నాకు ఏర్పడినందుకు బాధగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితి అయిందని చెప్పుకొచ్చారు. నాకు మొదటి నుంచి ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అలవాటు. అది అధికార పక్ష నేతైనా, ప్రతిపక్ష నేత అయినా.. స్వపక్ష నేత అయినా తప్పంటూ ఉంటే వాళ్ళ మొహం మీద కుండ బద్దలుకొట్టటం నా నైజం అని చేగొండి హరిరామ జోగయ్య లేఖలో తెలిపారు.