Breaking: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. అధికారులు ఏం చెబుతున్నారంటే?

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. సోమవారం సాయంత్రం శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కనిపించిందని భక్తులు అధికారులకు తెలిపారు. గతంలో చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే!

New Update
Mahanandi: మహానందిలో మరోసారి చిరుత సంచారం!

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. శ్రీవారి మెట్ల వద్ద సోమవారం రాత్రి చిరుత కనిపించిందని  కొందరు భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. మెట్ల మార్గం నుంచి చిరుత వెళ్లినట్లు చెబుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.అయితే ట్రాప్‌ కెమెరాల్లో మాత్రం చిరుత కదలికలు లేవని అధికారులు తెలిపారు.

గతంలో ఓ చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లి హతమార్చిన క్రమంలో స్వామి వారి భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే నడక మార్గంలో అనుమతిస్తున్నారు. నడక మార్గంలో గత కొద్ది రోజులుగా చిరుత, ఇతర క్రూర జంతువుల సంచారం ఎక్కువ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇందుకోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇటు అలిపిరి మార్గంలోనూ, అటు శ్రీవారి మెట్ల మార్గం వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

చిరుత, ఎలుగుబంట్లు వంటివి కనిపిస్తుండడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Also read: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. సదర్ నేపథ్యంలో ఈ రోజు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Advertisment
తాజా కథనాలు