Bear spotted at Srivari Mettu: తిరుమలలో ఎలుగు బంటి కలకలం.. భయాందోళనలో భక్తులు
శ్రీవారి మెట్ల మార్గంలో సోమవారం 2000వ మెట్టు వద్ద భక్తులు ఎలుగు బంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగు బంటిని కొందరు భక్తులు తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు తీసి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అధికారులు మెట్ల మార్గానికి చేరుకుని, పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు. ఎలుగు బంటి సంచారం ఎక్కువైన నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయ్యింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించడం లేదు. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలను సైతం నిషేధించింది. అంతేకాకుండా నడకమార్గాల్లో చిన్నారుల చేతులకు ట్యాగ్ లు కడుతున్న సంగతి తెలిసిందే.