Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత కలకలం..!

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత కలకలం సృష్టించింది. చిరుత ఎయిర్‌పోర్టు ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్‌ వైర్లకు తగలడంతో కంట్రోల్‌ రూమ్‌లోని అలారం మోగినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుతతోపాటు రెండు పిల్లల్లు ఉన్నట్లు సమాచారం.

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత కలకలం..!
New Update

Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత కలకలం సృష్టించింది. ఈ రోజు వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ప్రహరీ వద్ద చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. చిరుతతోపాటు రెండు పిల్లల్లు ఉన్నట్లు సమాచారం. చిరుత ఎయిర్‌పోర్టు ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్‌ వైర్లకు తగలడంతో కంట్రోల్‌ రూమ్‌లోని అలారం మోగినట్లు తెలుస్తోంది.

Also Read: అందుకే జగన్ అసమర్థ ముఖ్యమంత్రి: గన్ని వీరాంజనేయులు

వెంటనే భద్రతా అధికారులు అప్రమత్తమైయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరించినట్లు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అటవీ సిబ్బంది చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు.

#shamshabad-airport
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe