AP: మహనంది పుణ్యక్షేత్రంలో చిరుత కలకలం.. భక్తులకు అధికారుల హై అలర్ట్..!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత టెన్షన్ పెడుతోంది. నిన్న పచ్చర్లల్లో మహిళా మాజీ సర్పంచ్‌ను చంపేసిన చిరుత ఇవాళ మహనంది పుణ్యక్షేత్రంలో సంచరిస్తోంది. రోడ్డుపై తిరుగుతూ కనిపించిన చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. భక్తులు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

New Update
AP: మహనంది పుణ్యక్షేత్రంలో చిరుత కలకలం.. భక్తులకు అధికారుల హై అలర్ట్..!

Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత సంచారం ప్రజలను టెన్షన్ పెడుతోంది. నిన్న పచ్చర్లల్లో మహిళా మాజీ సర్పంచ్‌ను చంపేసి తలను తినేసిన చిరుత..ఇవాళ మహనంది పుణ్యక్షేత్రంలో సంచరిస్తోంది. మహానంది దేవాలయ గోశాల దగ్గర రోడ్డుపై తిరుగుతూ కనిపించిన చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

Also Read:  ‘వకీల్ సాబ్’ నటికి బెదిరింపులు.. వీడియోతో సహా బయటపెట్టిన పవన్ హీరోయిన్!

ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు మహనందికి వచ్చే భక్తులు అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు, చిరుత దాడులతో నల్లమల సమీప గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. భయాందోళనలో ఉన్న స్థానికులు, రైతులు, పశువుల కాపరులు, వ్యవసాయ కూలీలు.. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు