Heart Attacks:జబ్బులను ముందే పసిగట్టే రక్తపరీక్ష..అత్యంత తక్కువ ధరకే..

హార్ట్ ఎటాక్‌లు..ఈ మధ్య ఎక్కువగా కలవరపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వీటి వల్ల చాలా మంది చనిపోతున్నారు. అయితే ఇక మీదట ఆ సమస్య ఉండదు అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. కొత్త పరీక్ష వచ్చేసిందని చెబుతున్నారు. అదేంటో కింది ఆర్టికల్‌లో చదివేయండి.

New Update
Heart Attacks:జబ్బులను ముందే పసిగట్టే రక్తపరీక్ష..అత్యంత తక్కువ ధరకే..

Blood Test For Heart Attacks: గుండెపోటు మరణాలు ఈమధ్య కాలంలో చాలా ఎక్కవు అయ్యాయి. ఉన్నట్టుండి సడెన్‌గా చాతినొప్పి వచ్చి పడిపోతున్నారు. వెంటనే వైద్యం అందినా కొంతమంది ప్రాణాలు దక్కడం లేదు. కోవిడ్ తర్వాత ఈ మరనాలు మరింత ఎక్కువ అయిపోయాయి. అయితే వీటికి చెక్ పెట్టేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు ఓ బడ్ టెస్ట్‌ను కనుగొన్నారు. ఈ రక్త పరీక్షతో రానున్న ఐదేళ్ళల్లో గుండెపోటు ముప్పు గురించి తెలుసుకోవచ్చును. ఈ రక్త పరీక్షనే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టీమ్‌లో భారత మూలాలున్న ప్రదీప్ ఝుండే అను ప్రొఫెసర్ కూడా ఉన్నారు.

రక్త పరీక్షతో గుండెపోటు నిర్ధారణ..

గుండెపోటుల మీద జరిగిన పరిశోధనలో శరీరంలో ఒకరకమైన ప్రొటీన్ ఉండాల్సిన దాని కంటే ఎకకువ ఉంటే హార్ట్ ఎటాక్‌లు వస్తాయని తేలింది. ఈ ప్రోటీన్ స్థాయికి మించి ఉంటే శరీరం మొత్తానికి సరిపడే రక్తాన్ని గుండె పంప్ చేయలేదు. అలాంటప్పుడు హార్ట్ ఎటాక్‌లు వస్తాయి. అయితే ఇప్పటి వరకు ఈ గుండె పోటులు రావడం అనే విషయాన్ని ముందే ఎవరూ కనిపిట్టి చెప్పలేకపోయారు. ఏదో ఒక సింప్టమ్ వచ్చే వరకు డాక్టర్లు నిర్ధిరించడం కష్టం అయ్యేది.కానీ ఇప్పడు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కనిపఎట్టిన రక్తపరీక్షతో గుండెపోటుకు కారణమయ్యే అధిక ప్రొటీన్‌ను ముందే పరీక్షించవచ్చును. దీని ద్వారా వచ్చే మూడేళ్ళల్లో గుండెనొప్పి వస్తుందో లేదో ముందే పసిగట్టవచ్చును.

న్యూరో పెప్టైడ్ వై అనే ప్రొటీన్, బి-టైప్ నేచరియూర్టెక్ పెప్టైడ్‌ల పరిణామం కొలవడం ద్వారా హార్ట్ ఎటాక్‌లను కనిపెట్టవచ్చును. తీవ్ర ఒత్తిడి ఉన్నప్పుడు గుండెలోని నాడులు ఎన్‌పీవైని విడుదల చేస్తాయి. రక్త పరీక్షతో వీటిని గుర్తించవచ్చును. సాధారణ రక్త పరీక్షల మాదిరిగానే ఇదీ ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు అత్యంత తక్కువ ధరకే ఈ బ్లడ్ టెస్ట్‌లను చేయించుకోవచ్చని కూడా తెలిపారు.

Also Read:Andhra Pradesh: విశాఖపట్నం బీజేపీ ఎంపీ సీటు దక్కేదెవరికో..

Advertisment
తాజా కథనాలు