Chattisgarh: మరి కొద్దిగంటల్లో నాలుగు రాష్ట్రాల్లో అధికారం ఎవరికి దక్కుతుందో తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో .. అసలు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక విచిత్ర దృశ్యం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించి కనిపిస్తోంది. అక్కడా ముక్కోణ పోటీ ఉంది. అయితే అధికారం కోసం ప్రధాన పోటీ కాంగ్రెస్.. బీజేపీ మధ్యనే నెలకొని ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అధికార కాంగ్రెస్ కు కాస్త అనుకూలత ఉందని చెబుతున్నా.. పోటీ నువ్వా.. నేనా అన్నట్టుగా కనిపిస్తోంది. దీంతో హంగ్ వచ్చే అవకాశాలు కూడా ఛత్తీస్‌గఢ్ లో కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ లో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 46. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉందనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. కచ్చితంగా గెలుస్తామని చెబుతూనే.. తమ అభ్యర్థులకు కౌంటింగ్ సమయంలో ఎటూ పోకుండా కట్టడి చేసుకుంది.
ఇక బీజేపీ కూడా ఈసారి(Chattisgarh) కచ్చితంగా తామే గెలుస్తామనే నమ్మకంతో ఉంది. కచ్చితంగా 60 సీట్లకు పైగా గెలుస్తామనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ విషయంలో రెండు పార్టీలు కూడా ఇవన్నీ ఎలా ఉన్నా.. గెలుపు మాదే.. భారీ మెజార్టీ కూడా సాధిస్తాం అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ 60కి పైగా సీట్లు గెలుస్తామని ప్రకటించారు. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఫలితాల్లో కాంగ్రెస్ 40కి కూడా చేరదని రమణ్ సింగ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాలా సర్వేలు చెబుతున్నాయని అరుణ్ సావ్ అంటున్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ విజయం మాదే అని చెబుతోంది. రాష్ట్ర కాంగ్రెస్(Chattisgarh) విశ్వాసం చెక్కుచెదరదని డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌దేవ్ అన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది. అంచనాల విషయానికొస్తే, తాను వాటిని ఎల్లప్పుడూ సీరియస్‌గా తీసుకోనని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఏం జరిగి ఉంటుందో అంచనా వేసేందుకు వివిధ ఛానళ్లు, ఏజెన్సీలు చేస్తున్న ప్రయత్నాలు ఇవి. కానీ, ప్రజల అసలు అభిప్రాయం తెలియడానికి ఫలితాలు వచ్చే వరకూ వేచి ఉండాల్సిందే అన్నారు.
Chattisgarh ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ 46కు చేరుకోవచ్చు అనేది కనిపిస్తోందని అయితే, బీజేపీ 48, 46తో ఆగిపోదని, 52 నుంచి 70 సీట్లు గెలుస్తుందని గట్టిగ చెబుతున్నారు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎగ్జిట్ పోల్‌లో చూపిన బస్తర్ - సర్గుజా ఓటింగ్ పై సరిగా అంచనా లేదు. 3వ తేదీన రిజల్ట్ వస్తుంది, అందులో కాంగ్రెస్ 40కి కూడా చేరదు అంటూ ఢంకా భజాయిస్తున్నారు.
Also Read: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలి: మాయావతి డిమాండ్
భూపేష్ హ్యాట్రిక్ కొడతారా?
ఇక ముఖ్యమంత్రి భూపేష్ సింగ్ పోటీ చేస్తున్నపఠాన్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ బీజేపీ నుంచి విజయ్ బాఘేల్ జేసీసీజీ నుంచి అమిత్ పోటీలో ఉన్నారు. ఇప్పటివరకూ ఇదే స్థానం నుంచి ఆయన 5 సార్లు గెలుపొందారు. ఈసారి కూడా ఆయనే గెలిచే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే, గతం కంటే ఓట్లు తగ్గవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. త్రిముఖ పోటీవల్ల కాంగ్రెస్ కి నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ భూపేష్ తన పట్టు నిలబెట్టుకుంటారనీ.. కచ్చితంగా ఇక్కడ గెలిచి మూడోసారి సీఎం అవుతారని కాంగ్రెస్ అంచనాలు వేస్తోంది.
మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్..బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న ఈ పోటీలో.. హంగ్ పరిస్థితులు వస్తే బీజేపీ నుంచి తమ అభ్యర్థులను రక్షించుకోవడానికి కాంగ్రెస్ ఏర్పాట్లు చేసుకోవడం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టుగానే.. ఇక్కడ కూడా కౌంటింగ్ పూర్తయ్యే సరికి గెలిచిన అభ్యర్థులను అందరినీ బెంగళూరు తరలించాలని ఏర్పాట్లు చేసుకుంటోంది ఛత్తీస్‌గఢ్(Chattisgarh) కాంగ్రెస్.
Watch this interesting Video: