Chattisgarh result trends: ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ ఆశలు ఆవిరి.. స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ.. ఛత్తీస్‌గఢ్ లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉదయం 11 గంటల సమయానికి బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. అక్కడ 52 స్థానాల్లో బీజేపీ.. కాంగ్రెస్ 37 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. By KVD Varma 03 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Chattisgarh result trends: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్ మొదలైంది. నాలుగో దశ పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. బీజేపీ 52 స్థానాల్లో, కాంగ్రెస్ 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌దేవ్, అసెంబ్లీ స్పీకర్ చరణ్ దాస్ మహంత్ సహా ఏడుగురు మంత్రులు వెనుకబడి ఉన్నారు. అయితే, సీఎం భూపేష్ బఘేల్ మాత్రం చాలా సేపు వెనుకంజలో ఉన్న తరువాత ఇప్పుడు లీడ్ లోకి వచ్చారు. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు(Chattisgarh result trends) ప్రారంభమైన తర్వాత మొదట్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా ఆ తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. తొలి రౌండ్ తర్వాత బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కానీ ఆ తర్వాత సీఎం సహా పలువురు మంత్రులు ఒక్కొక్కరుగా వెనుకబడడం మొదలుపెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ చాలా వెనుకంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 90 స్థానాలకు నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది 11:30 గంటల సమయానికి రిజల్ట్స్ అప్ డేట్స్: ఛత్తీస్‌గఢ్‌లో(Chattisgarh result trends) డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌దేవ్, అసెంబ్లీ స్పీకర్ చరణ్ దాస్ మహంత్, మంత్రి అమర్జీత్ భగత్, మహ్మద్ అక్బర్, కవాసీ లఖ్మా, రవీంద్ర చౌబే, జైసింగ్ అగర్వాల్, రుద్రకుమార్ వెనుకంజలో ఉన్నారు. ఖైరాగఢ్‌లో రెండో రౌండ్ కౌంటింగ్‌లో ఈవీఎంలు చెడిపోయాయి. తొలి రౌండ్‌లోనూ కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తాయి. సుర్గుజాలోని లండ్రా స్థానం నుంచి బీజేపీ ఆధిక్యంలో ఉండగా, మూడో రౌండ్‌లో ప్రబోధ్ మింజ్ 7 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌లో ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ లీడ్ లోకి వచ్చారు హోం మంత్రి తామధ్వజ్ సాహు వెనుకంజలో ఉన్నారు. Also Read: రెండు స్థానాల్లో విజయం దిశగా రేవంత్.. కామారెడ్డిలో కేసీఆర్ కు థర్డ్ ప్లేస్! Chattisgarh result trends: బీజాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమ్ మాండవి ముందంజలో ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ చరణ్ దాస్ మహంత్, మంత్రి అక్బర్, కవాసీ లఖ్మా, రవీంద్ర చౌబే, జైసింగ్ అగర్వాల్, రుద్రకుమార్ వెనుకంజలో ఉన్నారు. సజా స్థానం నుంచి మంత్రి రవీంద్ర చౌబే రెండో రౌండ్‌లో వెనుకబడ్డారు. కవార్ధాలో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అక్బర్ 1675 ఓట్లతో వెనుకబడి ఉండగా, పండరియాలో బీజేపీకి చెందిన భావనా బోహ్రా ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌లో బిలాస్‌పూర్, బిల్హా, కోటా, తఖత్‌పూర్, బెల్తారాలో బీజేపీ, మస్తూరి సీటు నుంచి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. కోర్బా మంత్రి జైసింగ్ అగర్వాల్ వెనుకబడ్డారు, బిజెపికి చెందిన లఖన్‌లాల్ ముందున్నారు రాంపూర్‌లో మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే నంకిరామ్ వెనుకంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి ఫూల్‌సింగ్ ముందంజలో ఉన్నారు. రాయ్‌పూర్ వెస్ట్ నుంచి మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి రాజేష్ మునాత్ ముందంజలో ఉన్నారు. Watch Election results live on RTV Here: #chattisgarh #5-state-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి