ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో చాలా ఫేక్ చాట్‌జీపీటీ యాప్‌లు ఉండగా.. వాటికి సంబంధించిన ప్రీమియం ధరలు కూడా భారీగా ఉన్నాయి. ఈ వంటినే ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది OpenAI. చాట్‌జీపీ(ChatGPT) యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ (Android) ఫోన్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఇకపై మన మొబైల్ డివైజ్‌లో చాట్‌జీపీటీని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని OpenAI ప్రకటించింది. ఇంతకుముందు ఈ యాప్ ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇకమన్న వెబ్ వెర్షన్ లాగానే మనం అడిగే క్వశ్చన్స్‌కి చాట్‌బాట్ ఆన్సర్ ఇస్తుంది. అటు వెబ్ వెర్షన్‌తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఒక అడ్వాంటేజ్ ఉంది. మనం గతంలో అడిగిన ప్రశ్నలను ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా యాక్సెస్ చేయవచ్చు. వెబ్ వెర్షన్‌లో ఇంటర్‌నెట్ లేకపోతే ఏ పేజీ ఓపెన్ అవ్వదని తెలుస్తుంది..
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ChatGPT యాప్‌ని ఎలా ఉపయోగించాలి?
⦿ మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో గూగుల్ ప్లే స్టోర్ (గూగుల్ ప్లే స్టోర్)కి వెళ్లండి
⦿ OpenAI ద్వారా అభివృద్ధి చేసిన “ChatGPT” యాప్‌ని గుర్తించండి
⦿ ప్లే స్టోర్‌లో ChatGPTని పోలిన అనేక డూప్లికెట్ యాప్‌లు ఉండవచ్చు.. అందుకే క్రాస్ చెక్ చేసుకొని యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
⦿డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, యాప్‌ను ఓపెన్ చేయండి.
⦿ యాప్‌కి సైన్ ఇన్ చేయండి.
⦿ మీరు ChatGPT వెబ్ వెర్షన్‌కి ఉపయోగించిన అదే ఇమెయిల్ IDతో కూడా మీరు లాగిన్ చేయవచ్చు.
⦿ ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగడానికి, సమాధానాలను స్వీకరించడానికి మీ ఆండ్రాయిడ్‌లో ChatGPTని ఉపయోగించడం ప్రారంభించవచ్చు.
చాట్‌జీపీటీతో బేసిక్ బెనిఫిట్స్ ఏంటి?
⁍ ఇప్పటివరకు తెలియని క్షణాల్లో తెలుసుకోవచ్చు
⁍ మనకు తెలియని భాషలను కూడా నేర్చుకోవచ్చు
⁍ చాట్‌జీపీటీ నుంచి మంచి సజెషన్స్ తీసుకోవచ్చు
⁍ ఓపెన్ ఎండ్ చర్చలలో పాల్గొనవచ్చు.. అంటే మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవచ్చు
➡ పైన చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని చాట్‌జీపీటీ (ChatGPT) యాప్ ఉచిత వెర్షన్‌కు వర్తిస్తాయి. OpenAIకి చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. ఇది సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారులకు మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. అయితే ప్రతి చిన్న విషయానికి చాట్‌జీపీపై ఆధారపడటం మంచిది కాదని గుర్తుంచుకోండి. పూర్తిగా ఆధారపడితే అది వ్యసనంలా మారిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు సాధారణ మనుషులు చెప్పే విషయాలు అసలు పట్టించుకోకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది.