నేటికాలంలో ప్రజలకు ఆహారం పట్ల శ్రద్ధ ఎక్కువైంది. రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు తింటున్నారు. రాత్రిళ్లు భోజనం మానేసి..ఖాళీ కడుపుతో నిద్రించకూడదని వైద్యులు చెబుతున్నారు. తిన్నతర్వాత గంటన్నర తర్వాత పడుకోమని చెబుతున్నారు. రాత్రిఅన్నంతింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని...బరువు పెరుగుతారని..చాలా మందిలో అన్నం తినాలా వద్దా అనే సందేహం ఉంటుంది. అయితే..అన్నానికి బదులుగా..చపాతీలు తినమని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్..దసరా సెలవులు ఖరారు…ఎన్ని రోజులంటే..!!
చపాతీలు తింటే మేలు:
ఉదయం చేసిన చపాతీలు రాత్రి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. అదీకాక చపాతీలు తొందరగా జీర్ణం కావు. నెమ్మదిగా జీర్ణమవుతుంటాయి. అందుకే బ్లడ్ లో షుగర్ లెవల్స్ కూడా ఒక్కసారిగా పెరిగిపోవు. దానికి తోడు..రాత్రివేళ జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. అందుకే రాత్రి చపాతీలు తినడమే మంచిదని చెబుతున్నారు వైద్యులు.
బరువు తగ్గుతారు:
అధిక బరువతో బాధపడేవారు..బరువు తగ్గాలనుకునేవారు చపాతీలను తక్కువ నూనెతో కాల్చుకోని తినడం మంచిది. అసలు నూనె వాడకుండా చేసుకోవడం ఇంకా మంచిది. అన్నం కంటే చపాతీ ఎక్కువ శక్తినిస్తాయి. రెండు లేదా మూడు చపాతీలు తినాలి. ఎందుకంటే చపాతీల్లో కొవ్వు ఉండదు. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది...దీంతో ఇది గుండెకు మేలు చేస్తుంది.
మైదా:
సాధారణంగా చాలా మంది మార్కెట్లో గోధమపిండిని కొనుగోలు చేస్తారు. కానీ అందులో మైదా కలుపుతారన్న సంగతి చాలా మందికి తెలియదు. గోధుమపిండిని కొనుగోలు చేసేటప్పుడు బ్రాండెండ్ కంపెనీ కొనడం మంచిది. లేదంటే గోధుమలు కొనుగోలు చేసి పిండిగా మార్చుకోవడం ఇంకాచాలా మంచిది.
చపాతీలు తిన్నవెంటేనే:
భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రించకూడదన్న సంగతి తెలుసు. అదేవిధంగా చపాతీలు తిన్న తర్వాత కూడా గంటన్నర తర్వాతే నిద్రించాలి. ఇలా రోజూ సమయం ప్రకారం రాత్రివేళ చపాతీలు తింటే..రాత్రి 7 తర్వాత 10లోపే తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ఉదయం చపాతీలు తింటే:
కొంతమంది ఉదయం కూడా చపాతీలు తింటుంటారు. అలా తినడం కూడా మంచిదే. కానీ చాలా మంది రాత్రి వాటిని తింటుంటారు. చపాతీల్లో కర్రీ కోసం ప్రతిరోజూ ఆలు కర్రీనే తీసుకోకూడదు. ఆలు ఎక్కువైతే లావు అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజుకో వెరైటీ కర్రీని వాడినట్లయితే...అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.