ఏపీలో దసరా సెలవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. మొత్తం పది రోజులపాటు పాఠశాలలకు సెలవు ఇచ్చింది. అయితే ఏపీ సర్కార్ దసరా సెలవు తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. అక్టోబర్ 23వ తేదీతోపాటు 24వ తేదీన కూడా సెలవు దినంగా సర్కార్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: ఇన్నర్ రింగ్ కేసు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చేనెల 7కు వాయిదా
కాగా ఈనెల 24వ తేదీని దసరా సందర్భంగా సాధారణ సెలవుగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు బుధవారం సీఎస్ జవహర్ రెడ్డి జీవోఆర్టీ నెంబర్ 2047ను రిలీజ్ చేశారు. గతంలో దసరాను ఆప్షనల్ సెలవుగా ఏపీ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరిగి స్వల్ప మార్పులతో సీఎస్ జవహర్ రెడ్డి ఈరోజు మరోసారి ఉత్వర్వులను జారీ చేశారు. కాలేజీలకు కూడా 7రోజులపాటు దసరా సెలువులు ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఇక జనవరి నుంచి సంక్రాంతి సెలవులు, డిసెంబర్ నుంచి క్రిస్టమస్ సెలవులు, దీపావళి, ఉగాది రంజాన్ తదితర పండగలకు ఆ రోజును బట్టి సెలవులు ఇవ్వనున్నారు. డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్టమస్ సెలవులను ఐదు రోజులు ఇచ్చింది. ఐదు రోజులపాటు మిషనరీ పాఠశాలలకు సెలవులు ఉంటాయని..ఇతర స్కూళ్లకు మాత్రం ఒక్కరోజే సెలవు ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ ఏడాది వచ్చే మరో పెద్దపండగా సంక్రాంతికి 6రోజుల సెలవులను ప్రకటించింది. దీపావళి, రంజాన్ పండగలకు ఆ రోజును బట్టి సెలవులు ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి: స్వలింగ వివాహాలపై సుప్రీం తీర్పు..అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో ఏముంది?