BRS: 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చండి.. అధిష్టానానికి వినతులు

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 'బీఆర్ఎస్'పేరు చర్చనీయాంశమైంది. 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధిష్టానానికి తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ దూరం చేసుకోవద్దని, దీనిపై పునరాలోచించాలని ఆయన సూచించినట్లు సమాచారం.

BRS: 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చండి.. అధిష్టానానికి వినతులు
New Update

BRS: తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఎఫెక్టుతో 'బీఆర్ఎస్' ()BRS) పార్టీ పేరు మరోసారి చర్చనీయాంశమైంది. కేసీఆర్ (KCR) టీఆర్ఎస్ (TRS) ను బీఆర్ఎస్ మార్చినప్పటినుంచి దీనిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉండగా.. ఇతర పార్టీ నాయకులు సైతం టీఆర్ఎస్ కు తెలంగాణతో బంధం తెగిపోయిందని చాలా వేదికల్లో బలంగా వాదిస్తున్నారు. అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పేరు మార్పుకు సంబంధించి సొంత పార్టీ నేతలే అగ్రనాయకులకు సూచనలు చేయడం చర్చనీయాంశమైంది.

పార్టీ శ్రేణుల వినతులు.. 

ఈ మేరకు 'భారత్‌ రాష్ట్ర సమితి'ని తిరిగి 'తెలంగాణ రాష్ట్ర సమితి' గా మార్చాలని పార్టీ శ్రేణులు అధిష్టానాన్ని కోరుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు రాబోతుండగా.. సన్నాహక సమావేశాల్లో జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి విశ్లేషణలను కొనసాగిస్తూనే.. మరోవైపు ఎక్కువమంది పార్టీ నాయకులు టీఆర్ఎస్ ను తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి : Telangana : బీఆర్ఎస్ బిల్లు రద్దు.. పాత పద్ధతిలోనే యూనివర్సిటీల నియామకాలు?

కేటీఆర్‌ సమక్షంలో..

ఈ క్రమంలోనే బుధవారం వరంగల్‌ (Warangal) లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలోనూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) సమక్షంలో సీనియర్‌ నాయకులు కడియం శ్రీహరి (kadiyam srihari) దీనికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘తెలంగాణ పార్టీగా ప్రజల్లో మనకు బలమైన గుర్తింపు ఉంది. పార్టీ పేరులో ‘తెలంగాణ’ను తొలగించి, ‘భారత్‌’ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోంది. బీఆర్ఎస్ తమది కాదనే భావన ప్రజల్లో ఏర్పడుతోంది. వీలైనంత త్వరగా దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందనిపిస్తోంది' అని అయన మనసులో మాట బయటపెట్టినట్లు సమాచారం.

సెంటిమెంటును దూరం చేసుకోవద్దు..

అలాగే కనీసం  20 శాతం ప్రజల్లో ఆ భావన ఏర్పడినా.. మన పార్టీకి ఆ మేరకు ఓట్లు దూరమయ్యాయనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. పేరు మారిన తర్వాత అంతగా కలిసిరాలేదనే భావన కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఎక్కువమంది కార్యకర్తలు, ప్రజలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పార్టీకి వరమైన తెలంగాణ సెంటిమెంటును దూరం చేసుకోవద్దు. తిరిగి టీఆర్ఎస్ గా మారిస్తే బాగుంటుంది. ఇది మెజారిటీ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం. ఒకవేళ జాతీయస్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలనుకుంటే అలాగే ఉంచి.. రాష్ట్ర రాజకీయాలకు ‘టీఆర్ఎస్’ను తెర మీదకు తీసుకొచ్చే విషయాన్ని ఆలోచించాలి. ఇందులో న్యాయపరమైన అంశాలేమైనా ఉంటే మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ వంటివారు ఈ విషయంలో సంబంధిత నిపుణులతో చర్చిస్తే బాగుంటుంది. కేసీఆర్‌ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కడియం శ్రీహరి వివరించినట్లు తెలుస్తుండగా.. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

#kadiyam-srihari #ktr #brs #trs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe