ISRO ex Chief sivan VS Somnath: ఒకరు తుది మెట్టుపై బోల్తా పడితే మరొకరు తుది వరుకు పోరాడి గెలిచారు.. ఒకరు ఓటమి బాధను తట్టుకోలేక బోరున విలపిస్తే.. మరొకరు గెలిచిన ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. ఒకరు ఓదార్పు కోసం మోదీతో భుజాన్ని తట్టించుకుంటే.. మరొకరు శభాష్ అంటూ భుజాన్ని తట్టించుకున్నారు. గెలుపొటములు జీవితంలోనైనా.. అంతరీక్ష ప్రయోగాల్లోనైనా సర్వసాధారణం. ఓడినవారిని తక్కువ చేసి మాట్లాడల్సిన అవసరం లేదు.. గెలిచే వారిని ఆపాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇస్రో మాజీ చీఫ్ శివన్(Sivan).. ప్రస్తుత చీఫ్ సోమనాథ్(Somnath) భారతీయులకు ఎంతో ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరు. ఓడినా గెలిచినా ఇద్దరూ అంతరీక్ష ప్రయోగాలపై చెరగని ముద్ర వేసినవారే. ఇదంతా భారతీయుల వెర్షన్.. అయితే సోమనాథ్ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. శివన్‌పై సోమనాథ్ తన ఆటోబయోగ్రఫీ('నిలవు కుడిచ సింహాలు')లో సంచలన ఆరోపణలు చేశారు.
అందుకే ఫెయిల్ అయ్యింది:
2019, సెప్టెంబర్ 7న చంద్రయాన్-2 మిషన్ తుది మెట్టుపై బోల్తా పడింది. అక్కడే ఉండి ఈ ప్రయోగాన్ని వీక్షించారు ప్రధాని మోదీ. మిషన్ ఫెయిల్ కావడంతో అక్కడున్న సైంటిస్టులు సైలెంట్‌గా ఉండిపోయారు. మరికొందరు బాధను తట్టుకోలేక ఏడ్చేశారు. నాటి చీఫ్ శివన్ కూడా కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయారు. శివన్‌ను మోదీ ఓదార్చిన తీరు అందరికి గుర్తిండిపోయంది. అయితే చంద్రయాన్-2 ఫెయిల్యూర్‌కు శివనే కారణం అంటున్నారు సోమనాథ్. ఆటోబయోగ్రఫీలో అనేక అంశాలను ప్రస్తావించారు సోమనాథ్ అవసరమైన పరీక్షలు నిర్వహించకుండానే హడావుడిగా మిషన్‌ను ప్రారంభించారని రాసుకొచ్చారు సోమనాథ్. మితిమీరిన ప్రచారం కూడా చంద్రయాన్-2 మిషన్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేసిందని ఆరోపించారు.
చంద్రయాన్-2 ఫెయిల్యూర్‌కు సోమనాథ్ చెప్పిన ఐదు కారణాలు:
‣ ఇంజిన్‌లోని ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీలో సాఫ్ట్‌వేర్ లోపాలు
‣ రాంగ్ అల్గరిథం
‣ ఇంజిన్ థ్రస్ట్ ఫాల్ట్
‣ ఉపగ్రహం కదలికను తగ్గించడం
‣ అవసరమైన పరీక్షలు చేయకపోవడం
శివనే ఇలా చేశాడు:
కిరణ్ కుమార్ చైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రారంభించిన చంద్రయాన్-2 మిషన్‌లో శివన్ పలు మార్పులు చేశారని ఆరోపించారు సోమనాథ్. శివన్ సాఫ్ట్‌వేర్‌లోని గ్లిచ్‌ను దాచిపెట్టారని తన ఆటోబయోగ్రఫీలో పేర్కొన్నారు. నిజానికి చంద్రయాన్-2 వైఫల్యానికి సాఫ్ట్‌వేర్ లోపమని ప్రకటించాల్సిన సోమనాథ్ అలా చేయకుండా ల్యాండర్‌తో కమ్యూనికేట్ చేయలేకపోతున్నామని ప్రకటించారంటూ సంచలన ఆరోపణలు చేశారు సోమనాథ్.
నన్ను ఆపేందుకు ప్రయత్నించారు:
నిజానికి శివన్, సోమనాథ్ ఇద్దరూ కూడా 60ఏళ్ల తర్వాత(రిటైర్‌మెంట్) తర్వాత కూడా విధులు కొనసాగించారు. తమ సర్వీసును పొడిగించుకున్నారు. 2018లో ఏఎస్ కిరణ్ కుమార్ పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఇద్దరిలో ఒకరు ఛైర్మన్ అవుతారని అంతా భావించారు. చివరకు శివన్‌ను ఎంపిక చేశారు. అప్పటికీ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్ పదవిలో ఉన్న శివన్ ఆ పొజిషన్‌లోనూ కొనసాగారు. ఇదే విషయాన్ని ఆటోబయోగ్రఫీలో ప్రస్తావించిన సోమనాథ్.. ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా శివన్ VSSC డైరెక్టర్ పదవిలో కొనసాగడాన్ని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను నేరుగా శివన్‌నే అడిగానని.. కానీ ఆయన సమాధానం చెప్పలేదన్నారు సోమనాథ్. ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ బీఎన్ సురేశ్ జోక్యం వల్ల నాడు తనకు VSSC డైరెక్టర్ పొజిషన్ వచ్చిందని చెప్పారు. ఇస్రో చైర్మన్‌గా శివన్ ఎన్నికైన తర్వాత ఆరు నెలలకు సోమనాథ్ VSSC డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అటు ఛైర్మన్‌గానూ తన ఎన్నికను ఆపాలని చూశారంటూ బాంబు పేల్చారు సోమనాథ్. ఇస్రో ఛైర్మన్‌గా శివన్ మూడేళ్ల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా శివన్ తన సర్వీసును పొడిగించుకోవాలని చూసినట్లు రాసుకొచ్చారు సోమనాథ్.
మరోవైపు సోమనాథ్ ఆరోపణలపై శివన్ స్పందించారు. సోమనాథ్ ఆత్మకథలో ఏం రాసుకున్నారో తనకు తెలియదని.. ఈ విషయంపై తానేమీ చెప్పలేనన్నారు శివన్.
Also Read: ఢిల్లీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన..అదుపు తప్పిన బస్సు..ఒకరు దుర్మరణం..!!