ISRO: ఇస్రో న్యూ మిషన్.. చంద్రయాన్-4 ఎప్పుడంటే ..?

చంద్రయాన్‌-3 తర్వాత వాట్ నెక్ట్స్‌ అన్నదానిపై సర్వాత్ర చర్చ జరుగుతోంది. 2026లో చంద్రయాన్-4 ప్రయోగం ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కొత్త ప్రాజెక్టును లూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్ అంటే లూపెక్స్ అని పిలుస్తారని.. ఈ ప్రయోగం జపాన్‌కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా జరగనుందని ప్రచారం జరుగుతోంది.

New Update
ISRO: ఇస్రో న్యూ మిషన్.. చంద్రయాన్-4 ఎప్పుడంటే ..?

Isro to focus on Chandrayaan 4? : చంద్రయాన్- 3 సూపర్ సక్సెస్‌తో.. ప్రపంచవ్యాప్తంగా భారత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చంద్రయాన్-3 తో చంద్రుడి సౌత్ పోల్ రహస్యాలను ఛేదించే ఛాన్స్ వచ్చింది. మరి నెక్స్ట్ ఏంటి..? ఒక మిషన్ కు మించి, మరొకటి చేయడం మన సైంటిస్టులకు అలవాటే కదా...? మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు..? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న..? దీనికి ఆన్సర్ చంద్రయాన్-4 అని అంటున్నారు కొందరు.

ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది..2026లో చంద్రయాన్-4 ఉంటుందని చెబుతూనే.. మరోవైపు దీనికోసం జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ , మన ఇస్రోతో చేతులు కలుపుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త ప్రాజెక్టును లూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్ అంటే లూపెక్స్ అని పిలుస్తారని.. ఈ ప్రయోగం జపాన్‌కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా జరగనుందని ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై ఇస్రో ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

జపాన్‌తో చేతులు:
చంద్రుడి సౌత్ పోల్ పై వాటర్ ఉందనేది నిజం.. అయితే, అది ఎలాంటి వాటర్.. తాగడానికి పనికొస్తుందా లేదా అనేది మాత్రం తెలీదు.. మనం పంపిన ప్రజ్ఞాన్ రోవర్ కూడా ఆ వాటర్ ఫొటోస్ మాత్రమే పంపుతుంది కానీ.. ఆ వాటర్‌ను టెస్ట్ చేయదు..దీంతో లూపెక్స్ ఏ దీనికి ఆన్సర్ ఇస్తుంది అంటున్నారు. లూపెక్స్ తక్కువ గురుత్వాకర్షణ ఖగోళ వస్తువులపై ఉపరితల అన్వేషణకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయాలని కోరుతోంది. ఇందులో చలనశీలత పరిష్కారాలను శుద్ధి చేయడం , లూనార్ నైట్ సర్వైవల్ మెకానిజమ్‌లను పరిపూర్ణం చేయడం లాంటివి ఉన్నాయి. ఈ పురోగతులు భవిష్యత్ చంద్ర కార్యకలాపాలకు మద్దతు ఇస్తాయి. ఇక ఈ మిషన్ కోసం జపాన్ తో చేతులు కలపడం మంచిదే. ఎందుకంటే, టెక్నాలజీ పరంగా చూసుకుంటే జపాన్ కి తిరుగులేదు. మన దేశంలోని చాలా వెహికల్స్ ఇంజిన్లకు జపాన్ టెక్నాలజీ ఉంటుంది. దీంతో, జపాన్ సైంటిస్టులు, ఇస్రోతో కలిస్తే..బెటర్ టెక్నాలజీతో చంద్రయాన్-4 అదిరిపోతుంది.

చంద్రుడిపైనే వ్యాపారం:
చంద్రుడిపై మనుషులు ఉండేందుకు వీలవుతుందని తెలిస్తే..ఇక మన నెక్స్ట్ టార్గెట్ చంద్రుడిపై ఇల్లులు కట్టేయడమే..ఒక్క ఇండియానే కాదు.. ప్రపంచ దేశాలన్నీ పోటీ వచ్చేస్తాయి..దీంతో, అందరూ కలిసి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తారు. అయితే, ఇదంతా జరగాలి అంటే కొన్నేళ్లు పడుతుంది.. ఒకవేళ నిజంగానే ఇదంతా జరిగితే.. చందమామ రావే అని పాటలు పాటలు పాడుకోవడం ఉండదు.. డైరెక్ట్ రాకెట్ వేసుకొని అక్కడికి వెళ్లిపోవడమే.

Advertisment
Advertisment
తాజా కథనాలు