/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chandryan3-jpg.webp)
Chandrayaan-3: చంద్రమాన్-3 గురించి మరో కీలక సమాచారాన్ని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ తాజాగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన ఫొటోలను తీసిందని ట్వీట్ చేసింది. ఆర్బిటర్‌లోని డ్యుయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ పరికరం సెప్టెంబరు 6న ఈ ఫొటోలు తీసిందని పేర్కొంది. చంద్రుడిపై సౌర శక్తి వెలుగు లేకున్నా రాడార్ సహాయంతో ఫొటోలు తీయవచ్చని తెలిపింది.
Chandrayaan-3 Mission:
Here is an image of the Chandrayaan-3 Lander taken by the Dual-frequency Synthetic Aperture Radar (DFSAR) instrument onboard the Chandrayaan-2 Orbiter on September 6, 2023.More about the instrument: https://t.co/TrQU5V6NOq pic.twitter.com/ofMjCYQeso
— ISRO (@isro) September 9, 2023
ఇటీవల భూమి, చంద్రుని చిత్రంతో పాటు ఆదిత్య L1 మిషన్ తీసిన ‘సెల్ఫీ’ని ఇస్రో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇస్రో-ఆదిత్య L1 మిషన్ సూర్యునికి వెళుతున్నప్పుడు ‘సెల్ఫీ’ తీసుకుంది. అంతరిక్ష నౌక తీసిన భూమి, చంద్రుడి చిత్రంతో పాటు సెల్ఫీని కలిగి ఉన్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఇక చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండైన విక్రమ్ ల్యాండర్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA)కు చెందిన స్పేస్‌క్రాఫ్ట్ లూనార్ రికగ్నైసెన్స్ ఆర్బిటర్(LRO) గుర్తించింది. ఈ మేరకు ల్యాండర్‌ను ఫొటో కూడా తీసింది. ఈ విషయాన్ని ట్విట్టర్(ఎక్స్) ద్వారా నాసా తెలియజేస్తూ ఫొటోను షేర్ చేసింది. ఇస్రోకు చెందిన చంద్రయాన్-3 ఆగస్టు 23, 2023న చంద్రుడి దక్షిణ ధ్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో దిగింది అని పేర్కొంది. అంతేకాకుండా 42 డిగ్రీల స్లీవ్ యాంగిల్‌లో LRO ఈ ఫొటో తీసిందని.. ల్యాండర్ చుట్టూ ప్రకాశవంతంగా కనిపిస్తోందని తెలిపింది. మేరీల్యాండ్‌లోని గ్రీన్‌ల్యాండ్ నుంచి LROను నాసాకు చెందిన గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నిర్వహిస్తూ ఉంటుంది.
అంతకుముందు విక్రమ్ ల్యాండర్(Vikram Lander) తీసిన అద్భుతమైన 3 డైమెన్షనల్ ‘అనాగ్లిఫ్’ ఫోటోను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటో విభిన్న రంగులతో అద్భుతంగా ఆకట్టుకుంది. ‘ఇక్కడ అందించిన ‘అనాగ్లిఫ్’.. నావ్‌క్యామ్(NavCam) స్టీరియో ఇమేజెస్‌ని ఉపయోగించి సృష్టించబడింది. ఇందులో ప్రజ్ఞాన్ రోవర్‌లో సంగ్రహించబడిన ఎడమ, కుడి వైపు లొకేషన్ కనిపిస్తోంది.’ అని పేర్కొంది.
ఇది కూడా చదవండి: రామమందిరంపై బిగ్ అప్‌డేట్.. ఓపెనింగ్ డేట్ ఇదే..