Big Breaking: చంద్రుడిపై ఆక్సిజన్‌.. ప్రకటించిన ఇస్రో..!

చంద్రుడిపై ఆక్సిజన్‌ ఉన్నట్టు ఇస్రో తేల్చింది. చంద్రయాన్‌-3 ప్రయోగం ఈ ఇన్ఫోని షేర్ చేసింది..జాబిల్లిపై ఆక్సిజన్ ఉన్నట్టు ధృవీకరించింది. చంద్రుడి ఉపరితలంపై అల్యూమినియం (Al), సల్ఫర్ (S), కాల్షియం (Ca), ఐరన్ (Fe), క్రోమియం (Cr) టైటానియం (Ti) ఉనికి ఉన్నట్టు తెలిపింది. మాంగనీస్ (Mn), సిలికాన్ (Si)తో పాటు ఆక్సిజన్ (O) కూడా ఉన్నట్టు ఇస్రో పోస్ట్ చేసింది.

New Update
Big Breaking: చంద్రుడిపై ఆక్సిజన్‌.. ప్రకటించిన ఇస్రో..!

Chandrayaan 3 finds oxygen on moon: చంద్రయాన్‌ -3 నుంచి అతిపెద్ద అప్‌డేట్ ఇది..‌ విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ఇస్రోకి కీలక సమాచారం అందింది. చంద్రుని ఉపరితలం మీద ఆక్సిజన్‌ని గుర్తించారు. ఆక్సిజన్‌తోపాటు చంద్రుడి ఉపరితలంపై అల్యూమినియం (Al), సల్ఫర్ (S), కాల్షియం (Ca), ఐరన్ (Fe), క్రోమియం (Cr) టైటానియం (Ti) ఉనికి ఉన్నట్టు తెలిపింది. మాంగనీస్ (Mn), సిలికాన్ (Si) గుర్తించినట్టు ఇస్రో పోస్ట్ చేసింది. ఇక హైడ్రోజన్ ఉనికి కోసం పరిశోధన కొనసాగుతోంది. మొట్టమొదటి పరిశోధనను LIBS పేలోడ్‌ చెప్పింది.

గత పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
చంద్రుడిపై ఆక్సిజన్‌ అన్వేషన ఈనాటిది కాదు.. గతంలో అమెరికా అంతరీక్ష పరిశోధన సంస్థ నాసా సైతం జాబిల్లిపై ఆక్సిజన్‌ ఆచుకీ కోసం ప్రయోగాలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నాసా దీనిపై ఓ ప్రకటన కూడా చేసింది. నాసాలోని శాస్త్రవేత్తల బృందం చంద్రుని నేల నుంచి జీవనాధార మూలకాన్ని వెలికితీసింది. అక్కడ ఆక్సిజన్ ఉందని నిర్ధారించింది. జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు వాక్యూమ్ వాతావరణంలో అనుకరణ చేసిన చంద్రుడి నేల నుంచి ఆక్సిజన్‌ను సేకరించారు. వ్యోమగాములు ఒక రోజు సంగ్రహణ, చంద్ర వాతావరణంలో వనరులను ఉపయోగించుకోవడానికి మార్గం సుగమం చేశారు. ఈ ఆక్సిజన్ ఊపిరి పీల్చుకోవడమే కాకుండా రవాణాకు ఇంధనంగా కూడా ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెప్పగా.. ఇప్పుడు మన చంద్రయాన్‌-3 ఆక్సిజన్‌ ఉనికిని క్లియర్‌కట్‌గా గుర్తించింది.

నిజానికి చంద్రుడి రెగోలిత్ సుమారు 45శాతం ఆక్సిజన్‌తో రూపొందించబడింది . కానీ ఆ ఆక్సిజన్ ఖనిజాలతో గట్టిగా బంధించి ఉందన్నది సైంటిస్టులు చెబుతున్న మాట. చంద్రుడి రెగోలిత్ ప్రతి క్యూబిక్ మీటర్ సగటున 630 కిలోగ్రాముల ఆక్సిజన్‌తో సహా 1.4 టన్నుల ఖనిజాలను కలిగి ఉంటుంది. మనిషి జీవించేందుకు రోజుకు 800 గ్రాముల ఆక్సిజన్‌ను పీల్చుకోవాల్సి ఉంటుందని నాసా గతంలో చెప్పింది . కాబట్టి 630 కిలోల ఆక్సిజన్ ఒక వ్యక్తిని సుమారు రెండు సంవత్సరాలు (లేదా అంతకంటే ఎక్కువ కాలం) సజీవంగా ఉంచుతుంది. ఇక ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంపై కాలు మోపిన చంద్రయాన్‌-3 జాబిల్లిపై ఉన్న ఖనిజాల లిస్టును అందించింది. అందులో మూన్‌ సర్ఫెస్‌పై ఆక్సిజన్‌ ఉండడం సైంటిస్టుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.

ALSO READ: చంద్రయాన్‌-3 బాడీ పెయింటింగ్‌ ఫొటోలు వైరల్‌.. మీరు కూడా ఓ లుక్కేయాల్సిందే!

Advertisment
తాజా కథనాలు