ఆ చిన్న కారణంతో రూ.100 కోట్లు పోగొట్టుకున్న చంద్రమోహన్.. ఎందుకో తెలుసా?

ఈ రోజు తుదిశ్వాస విడిచిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ కు సంబంధించిన అనేక విషయాలపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఓ చిన్న కారణంతో దాదాపు రూ.100 కోట్ల ఆస్తులు పొగొట్టుకున్నానని గతంలో ఆయన స్వయంగా చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ చిన్న కారణంతో రూ.100 కోట్లు పోగొట్టుకున్న చంద్రమోహన్.. ఎందుకో తెలుసా?
New Update

సినీ నటుడు చంద్రమోహన్ శనివారం ఉదయం మరణించారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒకప్పుడూ లక్కీ హీరోగా ఓ వెలుగు వెలిగిన చంద్రమోహన్‌ సినిమాల ద్వారా చాలా ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ వాటిని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయారు. కొన్ని కోట్లు విలువ చేసే ప్రాపర్టీస్‌ను అతి తక్కువకే అమ్ముకున్నారు. దీంతో సంపాదించినదానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహనే స్వయంగా వెల్లడించగా ప్రస్తుతం ఈ వార్త మరోసారి వైరల్ అవుతుంది.

ఈ మేరకు 55 ఏళ్ల ఇండస్ట్రీలో ఉన్న చంద్రమోహన్ పలుచోట్ల భూములు, ఇండ్లు కొనుక్కున్నారు. ‘అప్పట్లో కొంపల్లి దగ్గర గొల్లపూడి మారుతీరావు ద్రాక్షతోట తీసుకున్నారు. ఆయన సలహాతో నేనూ అక్కడే 35 ఎకరాలు కొన్నాను. కానీ దాన్ని మెయింటెన్ చేయలేక అమ్మేశాను. శోభన్‌ బాబు ఎంత చెప్పినా వినకుండా మద్రాసులోని 15 ఎకరాలను కూడా అమ్ముకున్నా. ఇప్పుడు దాని విలువ రూ.30 కోట్లకుపైనే. అలాగే శంషాబాద్‌ దగ్గర మెయిన్‌ రోడ్డుకు 6 ఎకరాలు కొని అదీ అమ్మేశాను. ఇప్పుడు అక్కడ మంచి మంచి రిసార్టులు పెట్టారు. ఇలా దాదాపు రూ.100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా. నా జీవితంలో సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ’ అంటూ ఎమోషనల్ అయ్యారు.

Also read : Chandra Mohan: చంద్రమోహన్ భార్య చాలా టాలెంటెడ్.. ఆమె ఏం చేస్తారో తెలుసా?

ఇదిలావుంటే.. ఎన్ని ఆస్తులు పొగొట్టుకున్నా ఆయన పెద్దగా బాధపడలేదని, ఉన్నంతలో కుటుంబంతో ఆనందంగా గడిపినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల పెంపకంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్న చంద్రమోహన్.. వాళ్లను ప్రయోజకులను చేయడంకోసం చాలా డబ్బు ఖర్చు చేసి చదివించారు. అందుకు ఫలితంగా ఇద్దరూ కూతుళ్లు ఒకరు డాక్టర్, మరొకరు సైకాలజిస్ట్ హోదాలో ఉన్నారని చంద్రమోహన్ వ్యక్తిత్వం గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నారు సన్నిహితులు.

#for-a-small-reason #lost-rs-100-crores #chandramohan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe