Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు తన అభిప్రాయం పంపిన చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు తన అభిప్రాయం పంపారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి లపై చర్యలు తీసుకోవాలని కోరారు. By Jyoshna Sappogula 25 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి Chandrababu: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీ లోకి ఫిరాయించే సంస్కృతిని మారుస్తామంటూ గతంలో హామీ ఇచ్చిన సీఎం జగన్.. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను తీసుకోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ తీరుపై స్పీకర్ కు ఫిర్యాదు చేసి ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పార్టీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి పిటిషన్ ఇచ్చారు. Also Read: జగనన్న వదిలిన బాణం షర్మిల దారి ఇప్పుడెటు! ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, కరణం బలరాం కృష్ణమూర్తి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ పై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. బాల వీరాంజనేయస్వామి ఇచ్చిన అనర్హత పిటిషన్ పై పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయం కోరారు శాసన సభ స్పీకర్. దీంతో, పార్టీ నిర్ణయం మేరకే అనర్హత పిటిషన్ ఇచ్చామని వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు చంద్రబాబు బదులిచ్చారు. Also Read: కళ్యాణ్ కన్నింగ్ ప్లాన్..కావ్యను చీరతో కట్టి రాజ్ ఏం చేశాడంటే? ఇదిలా ఉండగా.. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లందరికీ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.' మీ భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం మీకు కల్పించిన అవకాశం ఓటు హక్కు. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు..మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు. మీ ఓటు తీసేస్తారు..లేదా మార్చేస్తారు. నకిలీ ఓట్లు చేర్చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు మీ ఓటు ఉన్నదీ, లేనిదీ చెక్ చేసుకోండి. ఓటు లేని వారు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోండి. ప్రజాస్వామ్యానికి మీ ఓటే పునాది. కాబట్టి ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకండి' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. #andhra-pradesh #ap-ex-cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి