AP MLC Seats : ఏపీ (Andhra Pradesh) లో కొత్త ఎమ్మెల్సీలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఖాళీ అయిన రెండు స్థానాలు ఎవరికి ఇస్తారనే ఆసక్తి నెలకొంది. టీడీపీ, జనసేన (Janasena) లకు చెరో సీటు తీసుకుంటాయా.. లేదంటే టీడీపీ (TDP) నే రెండు తీసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, పిఠాపురంలో పవన్‌ను గెలిపించిన వర్మకు ఇస్తారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: రేపు అమరావతికి చంద్రబాబు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్న సీఎం.!
అసెంబ్లీ సమావేశాల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్సీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మార్చి 2027 వరకే రెండు ఎమ్యెల్సీల పదవి కాలం ఉంటుంది. తక్కువ సమయమే ఉండటంతో సీనియర్లు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. రామచంద్రయ్యపై సస్పెన్స్ వేటు, ఇక్బాల్ రాజీనామా ఆమోదంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. అయితే, ఆ రెండు సీట్లు మళ్లీ వాళ్లకే ఇస్తారా? లేదంటే వేరే వ్యక్తులకు ఇస్తారా అనే చర్చ నడుస్తోంది.