Chandrababu Naidu : ప్రమాణ స్వీకారం తర్వాత తిరుపతి శ్రీవారి దర్శనానికి చంద్రబాబు

ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తమ ఇంటి దైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమల రానున్నారు.బుధవారం రాత్రి 9 గంటలకు చంద్రబాబు తిరుమలకు చేరుకోనున్నారు.

New Update
Chandrababu Swearing Ceremony: నేడు విజయవాడలో విద్యాసంస్థలకు సెలవు

Chandrababu Naidu Oath Ceremony : ఏపీ (Andhra Pradesh) కి నాలుగో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తమ ఇంటి దైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమల రానున్నారు.

బుధవారం రాత్రి 9 గంటలకు చంద్రబాబు తిరుమల (Tirumala) కు చేరుకోనున్నారు. అక్కడ గాయత్రి నిలయం అతిథి గృహంలో బాబు బస చేయనున్నారు. గురువారం ఉదయం 7:30 గంటలకు కుటుంబంతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. చంద్రబాబు పర్యటన‌ సందర్భంగా తిరుపతి, తిరుమలలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Also read: పడి లేచిన కెరటం.. నాలుగోసారి సీఎంగా చంద్రబాబు రికార్డు.. ఆయన రాజకీయ ప్రస్థానం ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు