Chandrababu: కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. కొత్తపేటలో బహిరంగ సభ

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాల హిట్ పెరుగుతోంది. రోజురోజుకు అధికార పార్టీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కనీస భద్రత లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దాడుల విషయాకి కొస్తే సీనియర్ నేతలకే రక్షణ లేదు.. ఇక ప్రజలను ఏవిధంగా కాపాడుతారు..? అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.

Chandrababu: కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. కొత్తపేటలో బహిరంగ సభ
New Update

మీ భవిష్యత్తుకు గ్యారంటీ

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తున్న విషయం తెలిసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపైన చేస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలో కనీసం భద్రత కూడా కల్పించలేని ప్రభుత్వం సీఎం జగన్ నడుపుతున్నారంటూ మండిపడ్డారు. తాజాగా చంద్రబాబుపై జరిగిన దారి దాడి కేసులో అయినా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీని విషయంలో రాష్ట్రపతికి, ప్రధాని మోదీకి  చంద్రబాబు లేఖను రాశారు. ఇక ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. వరుస పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు నేడు కూడా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. మీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ, పశ్చిమగోదావరి టూర్‌ విజయం అవ్వడంతో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా  కొత్తపేటలో మధ్యాహ్నం బహిరంగ సభలలో పాల్గొంటారు. అనంతరం రాత్రికి  అమలాపురానికి చంద్రబాబు చేరుకుంటారు.

సభ విజయవంతంకు తరలిరావాలి 

కోనసీమలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్‌ల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సభ విజయవంతం అయ్యే దిశగా ఇప్పటికే మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి పెద్దఎత్తున తరలిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు సీఎం జగన్‌ కూడా కోనసీమలోనే పర్యటించిన విషయం తెలిసిందే. గతంలో కూడా పవన్‌ కళ్యాణ్‌ వారాహి పర్యటన అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో విజయవంతం అయింది. వరస పెట్టిమరి ఏపీ నేతలు కోనసీమకు మంచి జోష్‌ను ఇస్తున్నారు.

రివర్స్‌ గేర్‌ బండిని పంపిద్దాం

ఇక వైసీసీ పాలన రివర్స్‌ గేర్‌లో ఉందని, గత నాలుగేళ్లలో అభివృద్ధి ఒక్కడుగు కూడా ముందుకు పడలేదని చంద్రబాబు నిన్నటి సభలో విమర్శించారు. బుధవారం మండపేట మండలంలో పర్యటించిన ఆయన తొలుత ఏడిదలో ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని.. అక్కడి కాటన్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండపేట కలువపువ్వు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకొచ్చిన జగన్‌ గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజల జీవితాలలో ఎటువంటి మార్పూ తేలేకపోయారని మండి పడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేశారని అన్నారని విమర్శలు చేశారు.

#chandrababu #visit-ambedkar-konaseema
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe