/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-1.jpg)
Chandrababu Swearing Ceremony: టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం అమరావతిలో జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే, వర్షాలు పడుతుండటంతో అమరావతిలో నేల చిత్తడిగా మారింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంతం మార్చనున్నారు.
Also Read: నిర్మానుషంగా వైసీపీ సోషల్ మీడియా.. అజ్ఞాతంలో సజ్జల భార్గవ రెడ్డి.!
అమరావతి నుంచి తాడేపల్లికి ఛేంజ్ చేశారు. ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తాడేపల్లి ప్రాంతానికి మారుస్తున్నారు. తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయనున్నారు.