Chandrababu Swaring In: అతిరథమహారధుల మధ్య.. లక్షలాది ప్రజల సమక్షంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు అనే నేను అని బాబు అనగానే.. సభా ప్రాంగణం ప్రజల నినాదాలతో మారుమోగిపోయింది

New Update
Chandrababu Swaring In: అతిరథమహారధుల మధ్య.. లక్షలాది ప్రజల సమక్షంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం 

Chandrababu Swaring In: ఏపీ అసెంబ్లీ ఎన్నికల క్రతువులో చిట్టచివరి అతి పెద్ద ఘట్టం ముగిసింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 12 ఎకరాలసు విశాల ప్రాంగణంలో.. పూల పల్లకి లాంటి వేదికపై.. దేశ ప్రధాని మోదీతో పాటు రాజకీయ అతిరథ మహారధులు.. సెలబ్రిటీలు, ప్రముఖుల మధ్య లక్షలాది మంది ప్రజల జయజయ ధ్వానాల మధ్య చంద్రబాబు నాయిడు అనే నేను అంటూ నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు. 

గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం అంతా ప్రజల నినాదాలతో మారు మోగింది. ప్రమాణ స్వీకార వేదికపై ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సహా 36 మంది ఆశీనులయ్యారు. 

పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం..

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు..

నారాలోకేష్..

పవన్ కళ్యాణ్ తరువాత నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అచ్చెన్నాయుడు..

లోకేష్ ప్రమాణం చేసిన తరువాత కింజారపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

వార్త అప్ డేట్ అవుతోంది..

Advertisment
తాజా కథనాలు