Chandrababu: జగన్ బొమ్మ తీసేస్తా.. కుప్పంకు విమానాశ్రయం తెస్తా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

జగన్ బొమ్మతో ఇచ్చిన పట్టాలను రద్దుచేసి నూతన పాస్ బుక్కులను పంపిణీ చేస్తానన్నారు సీఎం చంద్రబాబు. కుప్పంలో నాలుగోసారి సీఎం హోదాలో చంద్రబాబు మొదటి బహిరంగ సభ నిర్వహించారు. వ్యవసాయపరంగా, పారిశ్రామికపరంగా కుప్పంను అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు.

CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్
New Update

Chandrababu:  కుప్పంలో నాలుగోసారి సీఎం హోదాలో చంద్రబాబు మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఎనిమిదో సారి కుప్పం నుండి ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన కుప్పం ప్రజలకి పాదాభివందనాలు తెలిపారు. వ్యవసాయపరంగా, పారిశ్రామిక పరంగా కుప్పంను అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. గత ప్రభుత్వం హయాంలో జగన్ బొమ్మతో ఇచ్చిన పట్టాలను రద్దుచేసి నూతన పాస్ బుక్కులను పంపిణీ చేస్తానని తెలిపారు. కుప్పం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.

Also Read: నీకు ఆ అర్హతే లేదు.. సభలో అలా చేసిన వ్యక్తి జగన్ ఒక్కరే.. మంత్రి సంధ్యారాణి సెన్సేషనల్ కామెంట్స్

వైసీపీ అరాచక పాణంలో విసిగిపోయిన జనం కూటమికి అనూహ్య విజయాన్ని ఇచ్చారని కామెంట్స్ చేశారు. జూలై 1 నుండి పెంచిన నూతన పెన్షన్లు అమలులోకి తీసుకొస్తానని.. వికలాంగులకు 3000 నుండి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తామని తెలిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకి ఇప్పటికే తీర్మానం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ లను పునః ప్రారంభిస్తానన్నారు.

Also Read: ఆఖరికి దేవాన్ష్ కు కూడా 4 ప్లస్ 4 గన్‌మెన్‌లు.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..!

కుప్పంలో అన్నిరకాల పంటలూ పండుతాయని.. టమేటా కు సంబంధించి తక్కువ ఖర్చుతో ఎక్కువ నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్  ఏర్పాటు చేసి.. కూరగాయలు, పండ్లు, పూలు పండించే రైతాంగంతో సొసైటి ఏర్పాటు చేసి విదేశాలకు పంపేందుకు వీలైనంత తొందరలోనే కుప్పంకు విమానాశ్రయం తీసుకొని వస్తామన్నారు. కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపిస్తామని తెలిపారు. పాడి పరిశ్రమలో భాగంగా 10 లక్షల పాల సేకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. పేదరిక నిర్మూలనలో కుప్పం దేశానికి ఆదర్శం గా కావాలని.. కుప్పం అభివృద్ధికి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. అన్ని మారుమూల గ్రామాలకు నెట్ వర్క్ ఏర్పాటు చేస్తానన్నారు.

#ap-cm-chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe