ChandraBabu Quash Petition: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వాయిదా..

సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారినికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫున హరీష్‌ సాల్వే తన వాదనాలు వినిపించారు. 17ఏ సెక్షన్ వర్తించదని హైకోర్టు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు హరీష్‌ సాల్వే.

ChandraBabu Quash Petition: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వాయిదా..
New Update

సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై (Chandrababu Quash Petition) విచారణ కొద్ది సేపటి క్రితం పూర్తయింది. చంద్రబాబు తరఫున హరీష్‌ సాల్వే తన వాదనాలు వినిపించారు. 17ఏ సెక్షన్ వర్తించదని హైకోర్టు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు హరీష్‌ సాల్వే. వాదనలు మొత్తం 17ఏ చుట్టే తిరిగాయి. 17ఏ వర్తించదని హైకోర్టు చెప్పడం సరికాదన్న విషయంపై వాదనలు వినిపించారు హరీష్‌ సాల్వే. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నేరం ఎప్పుడు జరిగిందన్నది ముఖ్యం కాదు FIR ఎప్పుడు నమోదు చేశారన్నదే ముఖ్యమని హరీష్ సాల్వే తన వాదనల్లో పేర్కొన్నారు. 2018 తర్వాత నమోదయ్యే FIRలు అన్నింటికీ 17A వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: AP High Court: మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట

కేబినెట్ నిర్ణయం మేరకే స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (AP Skill Development Corporation) ఏర్పాటైందని న్యాయస్థానానికి వివరించారు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందాలు కూడా కేబినెట్ నిర్ణయాలు మేరకే జరిగాయని తెలిపారు. ప్రభుత్వ రాజకీయ కక్షతోనే కేసులను నమోదు చేస్తుందని హరీష్ సాల్వే వాదించారు. అయితే.. వాదనల తర్వాత ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. హైకోర్టులో దాఖలు చేసిన అన్ని పత్రాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చంద్రబాబు లాయర్లను ఆదేశించింది. చంద్రబాబు జైలులో ఉన్న నేపథ్యంలో పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన తరఫు న్యాయవాది లూథ్రా కోరారు. ముందే విచారణ జరపాలని న్యాయస్థానాన్ని విన్నవించారు.

చంద్రబాబు బెయిల్ కోసం కాకుండా క్వాష్ అడుగుతున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదన్నారు. కేసుకు సంబంధించి సీఐడీ వద్ద అన్ని రకాల ఆధారాలు సీఐడీ వద్ద ఉన్నాయన్నారు. అయితే.. సుప్రీంకోర్టులో ఈ రోజు చంద్రబాబుకు ఊరట లభిస్తుందని టీడీపీ నేతలు భావించారు. కానీ కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేయడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కోర్టు వాయిదా వేయడంతో ఈ నెల 9న ఈ పిటిషన్ పై మళ్లీ విచారణ జరగనుంది.

#chandrababu-arrest #supreme-court #ap-skill-development-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe