Chandrababu Polavaram Tour: ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఈరోజు.. పనులు పరుగులు పెడతాయా?

ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించడానికి ఈరోజు వెళ్లనున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు పోలవరం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్ట్ సందర్శిస్తారు. 2 గంటలకు పనులపై అధికారులతో సమీక్ష విలేకరుల సమావేశం ఉంటుంది. 4 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు

Chandrababu Polavaram Tour: ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఈరోజు.. పనులు పరుగులు పెడతాయా?
New Update

Chandrababu Polavaram Tour Every Monday : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అధికారులతో మొన్న ప్రాజెక్ట్ పై సమీక్షించారు. అయితే, అధికారులు చెప్పిన వివరాలతో చంద్రబాబు సంతృప్తి చెందలేదు. దీంతో ప్రత్యక్షంగా ప్రాజెక్ట్ పరిస్థితిని పరిశీలించాలని నిర్ణయించారు. ఈ పర్యటన ద్వారా పోలవరంపై సరైన అవగాహనా వస్తుందని అయన భావిస్తున్నారు. అంతేకాకుండా, ఇకపై ప్రతి సోమవారం పోలవరం పనులపై సమీక్షించాలని నిర్ణయించారు చంద్రబాబు. ఈ పర్యటనతోనే అది ప్రారంభమవుతుందని అయన వెల్లడించారు.  

చంద్రబాబు షెడ్యూల్ ఇదే..

Chandrababu Polavaram Tour :  పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయడమే తమ లక్ష్యమని ఎన్నికల ముందు చెప్పారు చంద్రబాబు. ఆ మాటకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు దృష్టి సారించారు. ప్రాజెక్టు సందర్శనకు సోమవరం వెళ్తానని, ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు పోలవరం సందర్శనకు రానున్న సీఎం...సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 1:30 గంటల వరకు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. 2 గంటల నుంచి ఒక గంట పాటు ప్రాజెక్ట్ పనులను అధికారులతో సమీక్షిస్తారు.  ఆ తరువాత విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడనున్నారు. వారికి పోలవరం ప్రాజెక్ట్ విషయాలను వెల్లడిస్తారు. అనంతరం నాలుగు గంటలకు అమరావతికి బయలుదేరుతారు. 

అప్పట్లో అలా..

విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా 2014లో బాధ్యతలు స్వీకరించాకా.. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ప్రాజెక్ట్ ను వేగంగా పూర్తి చేయాలని అయన భావించారు. అందుకు అనుగుణంగా ప్రతి సోమవారం సమీక్షలు నిర్వహిస్తూ.. పనులను ప్రయివేక్షిస్తూ వచ్చేవారు. దీంతో పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా జరగడమే కాకుండా.. తరచూ పోలవరం ప్రాజెక్ట్ విషయాలు ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడించేవారు. మళ్ళీ ఐదేళ్ల తరువాత ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మాట వినిపిస్తుండడం విశేషం 

డయాఫ్రమ్ వాల్-నిధులు

Chandrababu Polavaram Tour : గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో అతి ముఖ్యమైన డయాఫ్రమ్ వాల్ కొట్టుకు పోయినట్టు వెల్లడించింది. ఇప్పుడు చంద్రబాబు సమీక్ష తరువాత దాని పరిస్థితి ఏమిటనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది. డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కొత్తగా నిర్మించాలా? ఉన్న నిర్మాణాన్ని మరామ్మత్తులు చేసి బలోపేతం చేయాలా అనేది ఈరోజు తెలియవచ్చు. అయితే, అధికారుల లెక్కల ప్రకారం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు అవుతుంది. ఏ ఖర్చును కేంద్రం భరించాలా? కాంట్రాక్టర్ భరించాలా? రాష్ట్ర ప్రభుత్వం భరించాలా? అనే విషయంలో ఇప్పటివరకూ సందిగ్ధత ఉంది.. ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాసం కూడా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు చంద్రబాబు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. పోలవరం ప్రాజెక్ట్ కు నిధుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతొ మార్చేసిన కాంట్రాక్టర్ ఇప్పుడు కొనసాగుతారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

Also Read : నేడు బక్రీద్‌..హైదరాబాద్‌ లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

#andhra-pradesh #chandrababu-naidu #polavaram-project
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe