Chandrababu Bail: యుద్ధం ఇప్పుడే మొదలైందన్న లోకేష్.. చంద్రబాబు నేరుగా అక్కడికే..

హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు నాయిడు ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదలకానున్నారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ నివాసానికి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. యుద్ధం ఇప్పుడే మొదలైందని ఈ రోజు తనను కలిసిన నేతలతో లోకేష్ అన్నట్లు తెలుస్తోంది.

Chandrababu Bail: యుద్ధం ఇప్పుడే మొదలైందన్న లోకేష్.. చంద్రబాబు నేరుగా అక్కడికే..
New Update

చంద్రబాబుకు బెయిల్ (Chandrababu Bail) రావడంతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ (Nara Lokesh), నారా బ్రాహ్మణి రాజమండ్రికి ఇప్పటికే చేరుకున్నారు. బెయిల్ వచ్చిన తర్వాత పలువురు నేతలు లోకేష్ ను కలిశారు. 'యుద్ధం ఇప్పుడు ప్రారంభమైంది'.. అని నేతలు, కార్యకర్తలతో లోకేష్‌ అన్నట్లు తెలుస్తోంది. అయితే జైలు నుంచి విడుదల అనంతరం రాజమండ్రి నుంచి చంద్రబాబు నేరుగా తిరుపతికి (Tirupati) వెళ్లనున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనం తర్వాత హైదరాబాద్ కు వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు చంద్రబాబు విడుదల కానున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాజమండ్రికి భారీగా చేరుకుంటున్నారు.
Also Read: చంద్రబాబు విడుదల ఎప్పుడంటే.. సంచలన విషయాలు చెప్పిన లాయర్

ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు (High Court) ఈరోజు తీర్పు వెల్లడించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. నవంబర్‌ 24 వరకు షరతులతో కూడిన బెయిల్‌ ను ఇచ్చింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్‌ 24న బాబు తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.

దీంతో పాటు  బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని స్పష్టం చేసింది. ఫోన్‌లో కూడా మాట్లాడకూడదంటూ ఆదేశాల్లో పేర్కొంది న్యాయస్థానం. అలాగే  మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని ఈ సందర్భంగా హైకోర్టు తెలిపింది.

#chandrababu-case #chandrababu-bail-petition
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe