Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబు నాయుడికి కంటి ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యింది. 45 నిమిషాల్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు. కాగా, తనకు ఆపరేషన్ చేసిన వైద్యులతో చంద్రబాబు గ్రూప్ ఫోటో దిగారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాలతో బెయిల్ పొందిన విషయం తెలిసిందే. దాదాపు 52 రోజులు జైల్లో ఉన్న ఆయన.. కొన్ని రోజులుగా కంటి సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. జైలు నుంచి విడుదలైన ఆయన నేరుగా.. హైదరాబాద్ వచ్చి కంటి సంబంధిత పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చంద్రబాబుకు కుండి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. 45 నిమిషాల్లో శస్త్ర చికిత్స పూర్తి చేశారు. సర్జరీ అనంతరం చంద్రబాబును డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం చంద్రబాబు జూబ్లీహిల్స్ లోన నివాసానికి చేరుకున్నారు.
Also Read:
వెండితెర లోకనాయకుడు..నటనకు ప్రాణం పోసే కమల్ హసన్ బర్త్ డే టుడే.