ChandraBabu: 10 ప్రశ్నలు.. 48 గంటలు.. సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్

సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఇసుకాసురుడు పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బాబు ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తాను చేసిన ఆరోపణలపై 48 గంటల్లో స్పందించాలని జగన్‌కు సవాల్ విసిరారు.

ChandraBabu: 10 ప్రశ్నలు.. 48 గంటలు.. సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్
New Update

సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇసుకాసురుడు పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బాబు.. జగన్ రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేశారు. 2022 నుంచి వైసీపీ నేతలకే ఇసుక దందా అప్పగించారని విమర్శించారు. ఇసుకలో వాటాల నిబంధనలు ఉల్లంఘించారని.. వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్జీటీ, సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా తవ్వకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. అనధికారికంగా 500కుపైగా ఇసుక రీచ్‌లలో దోపిడీ చేశారని... ఇసుకను నల్లబజారులో అధిక రేటుకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..?

☛ ప్రజలకు చెందాల్సిన సంపదను వైసీపీ నేతలు దోచుకుంటున్నారు.

☛ ఇసుక మీద ఆదారపడి ఎంతో మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు.

☛ వైసీపీ చర్యలతో కార్మికులు రోడ్డున పడుతున్నారు.

☛ టీడీపీ హయాంలో నిర్మాణ రంగానికి చేయూతనిచ్చాం.

☛ తప్పుడు వాగ్దానాలతో జగన్ అధికారంలోకి వచ్చారు.

☛ ఇసుక దోపిడీతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది.

☛ ఇసుక తోడేసి ప్రాజెక్టులను విధ్వంసం చేస్తున్నారు.

☛ వ్యాపార అనుభవం లేని జేపీ పవర్ వెంచర్స్ కు అప్పగించారు.

☛ వాటాలో తేడా రావడంతో టర్న్ కీ సంస్థను బయటకు గెంటేశారు.

☛ వర్షాకాలంలో ఇసుక తవ్వకూడదనే నిబంధన ఉంది.

☛ కృష్ణా నదిలోనూ రోడ్లు వేసి ఇసుకను తోడేశారు.

☛ అన్ని నిబంధనలు ఉల్లంఘించి కోట్ల టన్నుల ఇసుక దోపిడీ చేశారు.

☛ ఇసుక మాఫియా మోసాలకు ఎందరో బలయ్యారు.

☛ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమ్‍రాజ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

☛ రాజమండ్రిలో ఎస్సీ యువకుడికి శిరోముండనం చేశారు.

☛ ఇసుక మాఫియాపై ప్రశ్నించే వారిని పలురకాలుగా వేధించారు.

☛ ఎన్జీటీకి వెళ్లినవారి ఆస్తులపై దాడులు, తప్పుడు కేసులు పెట్టారు.

☛ ఇసుకను వేరే రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు.

☛ ఇచ్చాపురం నుంచి తడ వరకు అన్నీ దొంగ వే బిల్లులే.

☛ ఇసుక దొంగ రవాణాను పోలీసులు పట్టించుకోవడం లేదు.

☛ జగన్ ఇంటి దగ్గర గుండిమెడలో 3 లక్షల టన్నుల ఇసుక అక్రమ తవ్వకం చేశారు.

☛ ఎక్కడ చూసినా ఇసుక నిల్వచేసి దోపిడీ చేస్తున్నారు.

☛ నదులకు అడ్డంగా రోడ్లు వేసి మరీ ఇసుక దోచుకుంటున్నారు.

☛ రాజధాని అమరావతిలోనూ ఇసుకను వదలడం లేదు.

☛ అన్నమయ్య జిల్లా నందలూరులో అక్రమంగా ఇసుక తవ్వకం చేపట్టారు.

☛ అన్నమయ్య జిల్లా నుంచి చెన్నైకు ఇసుక పంపిస్తున్నారు.

☛ ప.గో.జిల్లాలో గోదావరి నది చుట్టూ ర్యాంపులు వేశారు.

☛ నందిగామ రీచ్ నుంచి పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారు.

☛ రాష్ట్రంలో శాండ్ పాయింట్లు ఎన్ని.. వాటిలో ఉన్న స్టాక్ ఎంత?

☛ ప్రజలు ఐదేళ్లు మాత్రమే అధికారం ఇచ్చారని గుర్తించాలి.

☛ జీఎస్‍టీ ఎంత చెల్లించారు.. ఏ సంస్థ పేరున చెల్లించారు?

☛ ఇసుక రీచ్‍లు.. తవ్వకాల వివరాలను ఆన్‍లైన్‍లో ఉంచాలి.

☛ నదులను, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

☛ పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకూడదు.

☛ ఒప్పందాలు లేకపోయినా నేడు ఇసుక తవ్వుతుంది ఎవరు?

☛ ఇసుక దోపిడీపై జగన్ 48 గంటల్లో సమాధానం చెప్పాలి.

Also Read: టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe