మరోసారి హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు.. ఎందుకోసమంటే..

ఇసుక స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు నాయుడు. ఉచిత ఇసుక స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు అధికారులు.

New Update
Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు తన అభిప్రాయం పంపిన చంద్రబాబు

AP Sand Scam Case: ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైకోర్టును(AP High Court) ఆశ్రయించారు. ఇసుక స్కీమ్‌ కేసులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఉచిత ఇసుక స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు చంద్రబాబుపై(Chandrababu) కేసు నమోదు చేశారు. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు అధికారులు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాతను చేర్చగా.. ఏ-2గా చంద్రబాబు పేరును పేర్కొంది సీఐడీ. ఈ నేపథ్యంలోనే.. తనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. ఈ పిటిషన్ బుధవారం నాడు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఇసుక కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2 గా చంద్రబాబు, ఏ-3గా చింతనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమ మరికొందరు పేర్లను చేర్చింది సీఐడీ.

ఇన్నర్ రింగ్ కేసులోనూ బెయిల్ పిటిషన్..

ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు..ఇన్నర్ రింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ రోజు దాని మీద ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ మీద ఇంతకు ముందు విచారణ జరిగింది. అప్పుడు చంద్రబాబుకు ఇవాల్టి వరకు అంటే నవంబర్ 7వరకు అరెస్ట్ చేయ్యదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. విచారణ దశలో ఉన్న పిటి వారెంట్ పై ఇవాళ్టి వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణకు బాబు సహకరిస్తారని గత విచారణలో చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వుల సమయం నేటితో ముగిసింది. దీని మీద ఇవాళ వాదనలు జరిగాయి. ఈ కేసును కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. 

చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి..

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబు నాయుడికి కంటి ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యింది. 45 నిమిషాల్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు. కాగా, తనకు ఆపరేషన్ చేసిన వైద్యులతో చంద్రబాబు గ్రూప్ ఫోటో దిగారు.

Also Read:

వెండితెర లోకనాయకుడు..నటనకు ప్రాణం పోసే కమల్ హసన్ బర్త్ డే టుడే.

ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు డాక్టర్ ఇంతియాజ్ అరెస్ట్

Advertisment
తాజా కథనాలు