Chandrababu: ఈసారి లక్ష మెజార్టీ ఖాయం!.. ధర్మమే గెలుస్తుందన్న చంద్రబాబు

ఈ సారి కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ తాను సాధించడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తంచేశారు. చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఆయన కుప్పం నియోజవకర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపించారు.

New Update
Chandrababu: ఈసారి లక్ష మెజార్టీ ఖాయం!.. ధర్మమే గెలుస్తుందన్న చంద్రబాబు

Chandrababu: వైసీపీ ప్రభుత్వం వల్ల కుప్పం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన కుప్పం (Kuppam) నియోజవకర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు.

తనను, తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రజలు, కార్యకర్తలపై భారీగా అక్రమ కేసులు పెట్టారని, జైలుకు పంపారని ఆరోపించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా బెదరకుండా నిలబడ్డారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానన్నారు. ఎప్పటికైనా ధర్మమే జయించి తీరుతుందని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: రైతులు ఇబ్బందులు పడుతుంటే బస్సు యాత్రలు చేస్తారా? వైసీపీ మంత్రులపై బుద్ధ వెంకన్న సీరియస్!

తన సమావేశాలకు వచ్చిన వారిపైనా కేసులు పెట్టి వేధించారని, తాను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న 35 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని చంద్రబాబు అన్నారు. తన అక్రమ అరెస్టు సమయంలో మద్దతుగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన అక్రమ అరెస్టుపై నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూడా తప్పుడు కేసులు పెట్టడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, ఓటర్ వెరిఫికేషన్ వంటి పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలను నేతలు చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు