SKILL DEVELOPMENT CASE: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఏంటి? ఇందులో చంద్రబాబు పాత్ర ఏంటి?

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు 2015లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 3 వేల 356 కోట్ల ఈ ప్రాజెక్టులో రూ. 371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి నంద్యాల పట్టణంలోని జ్ఞానపురం ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారు.

SKILL DEVELOPMENT CASE: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఏంటి? ఇందులో చంద్రబాబు పాత్ర ఏంటి?
New Update

What is AP Skill Development Corruption Case: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నంద్యాల పట్టణంలోని జ్ఞానపురం ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారు. అటు రాష్ట్రవ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను కూడా గృహనిర్బంధంలో ఉంచారు. సెక్షన్లు 120B (నేరపూరిత కుట్ర), 420 (మోసం చేయడం నిజాయితీగా ఆస్తుల పంపిణీని ప్రేరేపించడం), 465 (ఫోర్జరీ) సహా సంబంధిత IPC సెక్షన్ల కింద చంద్రబాబును అరెస్టు చేశారు. దీంతో పాటు ఏపీ సీఐడీ కూడా ఆయనపై అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించింది. మరోవైపు ఈ స్కిల్‌ డెవల్‌ప్‌మెంట్ స్కామ్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో APSSDC ఏర్పాటైంది. నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా నిరుద్యోగ యువత సాధికారతపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. 3,300 కోట్ల రూపాయల కుంభకోణంపై AP CID మార్చిలో దర్యాప్తు ప్రారంభించింది. సరైన టెండర్ ప్రక్రియను అనుసరించకుండా ప్రాజెక్ట్ ప్రారంభించారన్న ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి ప్రాజెక్ట్‌కి ఆమోదం లేదు. సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా వనరులను పెట్టుబడి పెట్టడంలో వైఫల్యం లాంటి అనేక ఇతర అవకతవకలను కూడా దర్యాప్తులో బయటపెట్టింది. ప్రాజెక్ట్ కోసం కేటాయించిన నిధులను షెల్ కంపెనీలలోకి పంపారు. సీమెన్స్ గ్లోబల్ కార్పొరేట్ ఆఫీస్ ఈ ప్రాజెక్ట్‌పై అంతర్గత దర్యాప్తులో ప్రాజెక్ట్ మేనేజర్ హవాలా లావాదేవీల ద్వారా ప్రభుత్వం కేటాయించిన సొమ్మును షెల్ వ్యాపారాలకు మళ్లించాడని తేలింది. అందుకే ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు నైపుణ్యం అభివృద్ధి కోసం ఆరు ఎక్స్‌లెన్స్ కేంద్రాలను అభివృద్ధి చేసే పనిని సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియాకు అప్పగించారు. ప్రాజెక్టులో సీమెన్స్ సంస్థ వాటా 90శాతం ఉండగా.. రాష్ట్రప్రభుత్వం వాటా 10శాతం ఉంది. సీమెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆ MOU పక్కనపెట్టారనే ఆరోపణలున్నాయి.

Also Read: నేనేమన్నా టెర్రరిస్టునా.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నన్ను అరెస్ట్‌ చేశారు.. చంద్రబాబు ఫైర్!

స్కామ్‌ గురించి కీలక పాయింట్లు:
➼ 2015 జూన్‌లో యువతకు నైపుణ్య శిక్షణకు రూ. 3,350కోట్ల ప్రాజెక్టు
➼ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ కంపెనీల మధ్య ఒప్పందం
➼ జర్మనీకి చెందిన సీమెన్స్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం
➼ ప్రాజెక్టులో సీమెన్స్ సంస్థ వాటా 90శాతం
➼ రాష్ట్రప్రభుత్వం వాటా 10శాతం
➼సీమెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆ MOU పక్కనపెట్టారనే ఆరోపణలు
➼ సీమెన్స్‌ స్థానంలో ఎలాంటి MOU లేకుండానే డిజైన్‌టెక్‌ కంపెనీ ఎంట్రీ!
➼ సీమెన్స్‌ నుంచి రూపాయి రాకుండానే ప్రభుత్వ నుంచి రూ.371 కోట్లు విడుదల
➼ రూ. 371కోట్లలో డిజైన్‌టెక్‌ కంపెనీకి చేరిన రూ. 240కోట్లు
➼ డిజైన్‌టెక్‌ నుంచి వివిధ షెల్‌ కంపెనీలకు రూ. 240కోట్లు
➼ 2020 ఆగస్టులో విచారణకు ఆదేశించిన వైసీపీ ప్రభుత్వం
➼ 2020 డిసెంబర్ 10న విజిలెన్స్ విచారణ
➼ 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ ఎంక్వైరీ
➼ 2021 డిసెంబర్ 9న కేసు సీఐడీకి బదిలీ
➼ సీమెన్స్ కంపెనీ, డిజైన్‌టెక్‌ కంపెనీలపై కేసులు
➼ ముగ్గుర్ని అరెస్ట్ చేసి, 30కోట్లు అటాచ్‌ చేసిన ఈడీ
➼ తాజాగా సీఐడీ విచారణలో మరికొందరి అరెస్ట్

కేసు నెంబర్‌ 29-2021
120(B), 166, 167, 418, 420, 465, 468, 471, 409
201, 109, రెడ్‌ విత్‌ 34, 37
1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 12, 13 (2), రెడ్‌ విత్‌, 13(1) (C) (D)

చంద్రబాబు పాత్ర:
చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు 2015లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 3 వేల 356 కోట్ల ఈ ప్రాజెక్టులో రూ. 371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2020లో ఇప్పటి వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్, 2021 ఫిబ్రవరిలో ఏసీబీ విచారించింది. అనంతరం ఈ కేసు సీఐడీకి బదిలి అయింది. ఈ అవినీతి కుంభకోణంలో ఏ1గా చంద్రబాబు పేరు, ఏ2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.

ALSO READ: చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు.. వీడియో..!

#chandrababu-arrest #skill-development-case #ap-skill-development-case #ap-skill-development-corruption-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe