Chandrababu arrest: నంద్యాలలో చంద్రబాబు అరెస్టు.. FIRలో తన పేరు లేదంటున్న టీడీపీ అధినేత! టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే తన అరెస్టుకు కారణం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబును దగ్గరకు పోలీసులు వెళ్లనివ్వకుండా అడ్డుగా నిలబడి పోలీసు అధికారులతో టీడీపీ నాయకులు గొడవకు దిగారు . ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేశారు By Trinath 09 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Chandrababu Naidu Arrest in Skill Development Scam: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నంద్యాల పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నంద్యాల రేంజ్ డీఐజీ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చంద్రబాబును అదుపులోకి తీసుకునేందుకు పట్టణంలోని శిబిరం వద్దకు చేరుకున్నారు. అయితే, అక్కడ పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నిబంధనల ప్రకారం తెల్లవారుజామున 5.30 గంటల వరకు చంద్రబాబు వద్దకు ఎవరినీ అనుమతించలేమని చెప్పడంతో SPG బలగాలు కూడా పోలీసులను అనుమతించలేదు. చివరకు ఉదయం 6 గంటల ప్రాంతంలో చంద్రబాబు వాహనం తలుపులు కొట్టి కిందికి దించి తీసుకెళ్లారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం(Andhra Pradesh skill development corporation)లో తనను అరెస్ట్ చేస్తున్నట్లు డీఐజీ తెలిపారు. చంద్రబాబు వాహనంలోకి తీసుకెళ్లారు. ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కోట్లాది రూపాయల ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం గురించి చాలా కాలంగా రచ్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan)నే అనేకసార్లు ఆరోపించారు. స్కామ్‌ను నిపుణులతో ప్లాన్ చేసి, దర్శకత్వం వహించి, అమలు చేశారని, ఆయన ప్రభుత్వం కేవలం మూడు నెలల వ్యవధిలో ఐదు విడతల్లో 371 కోట్ల రూపాయలను హడావుడిగా చెల్లించిందని ఆరోపించారు. పథకం అభివృద్ధికి రూ. మరోవైపు ఆరోపణలను టీటీడీ (TDP) ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తోంది. నోటీసులు ఈడీ ఏం చెబుతుందంటే? 3,300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంచనాతో, APSDC, సిమెన్స్ అండ్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా లిమిటెడ్ అండ్ డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో కూడిన కన్సార్టియం ద్వారా అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేశారు. సీమెన్స్ ఆరు 'కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి అత్యుత్తమమైనదని మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 10శాం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 90శాతం సీమెన్స్ అండ్ డిజైన్ టెక్ ద్వారా గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో అందించారు. అయితే.. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రకారం, ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వకముందే ఎలాంటి టెండర్లు పిలవకుండానే రూ.371 కోట్లు (పన్నులతో సహా) విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం ఏపీ సివిల్ వర్క్స్ కోడ్ అండ్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్‌ను ఉల్లంఘించిందని తెలుస్తోంది. ఈడీ ప్రకారం.. APSDC డైరెక్టర్‌తో పాటు మాజీ CEO అండ్ MD ప్రమేయంతో నిధులు మళ్లించారు. కంపెనీలకు అందించిన 90శాతం ఇన్‌కండ్ గ్రాంట్‌ను పేర్కొనకుండా అధికారులు రూ.371 కోట్లకు వర్క్ ఆర్డర్‌ను రూపొందించారని ఆరోపించింది. ALSO READ: వాళ్లను బొంద పెడతాం.. ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్.. #chandrababu-arrest #skill-development-case #ap-skill-development #chandrababu-naidu-arrested #ex-andhra-chief-minister-chandrababu-naidu-arrested #chandrababu-naidu-arrested-in-skill-development-case #chandrababu-naidu-arrested-in-corruption మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి