ఏపీ హైకోర్టులో చంద్రబాబు (Chandrababu) లాయర్లు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని కోరారు. చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ 3 నెలల క్రితం జరిగిందని.. ఇప్పుడు కుడి కంటికి కూడా ఆపరేషన్ జరపాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే.. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించే అశంపై వెకేషన్ బెంచ్ ఇంకా నిర్ణయం తెలపలేదు. ఏపీ హైకోర్టు (AP High Court) నిర్ణయం కోసం చంద్రబాబు తరఫు లాయర్లు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబునాయుడు కంటి సమస్యలకు చికిత్స అవసరమంటూ వైద్యులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం దాచిపెడుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu Arrest Updates: ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన భువనేశ్వరి
బుధవారం చంద్రబాబును పరీక్షించిన వైద్యులు నివేదిక ఇచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆ నివేదికలో చంద్రబాబు కంటికి చికిత్స అవసరమని పేర్కొన్నారని వారు అంటున్నారు. కానీ, జైలు అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో కంటి సమస్య గురించి ప్రస్తావించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: వారం,పదిరోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో వస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
జైలు అధికారులు చంద్రబాబు వైద్య నివేదికలను మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల ఆరోపణలపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ వివరణ ఇచ్చారు. చంద్రబాబు నాలుగు నెలల క్రితం ఓ కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని తెలిపారు. అయితే.. బుధవారం ఆయనను పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు.. రెండో కంటికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారని వెల్లడించారు.