AP Pensions: ఏపీలో ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గత నెల మాదిరి ఈసారి కూడా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. 1వ తేదీనే 99 శాతం మందికి పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. పలు కారణాలతో పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అందించాలని అన్నారు.
ఈ మేరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ఈ నెల 31నే బ్యాంక్ నుంచి నగదు విత్ డ్రా చేసుకొని దగ్గరపెట్టుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ దారులకు పెన్షన్ డబ్బు ఒకటో తేదీన అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. గతంలో జరిగిన తప్పులను ఈసారి జరగకుండా.. పెన్షన్ దారులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలని సూచించారు.