AP Pensions: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు నెల కూడా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లను పంపిణీ చేయనుంది. ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీని చేపట్టాలని అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు.

New Update
Telangana: ఉద్యోగులకు శుభవార్త...ఆగస్ట్‌ 15 తరువాత డీఏ ప్రకటన!

AP Pensions: ఏపీలో ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గత నెల మాదిరి ఈసారి కూడా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. 1వ తేదీనే 99 శాతం మందికి పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. పలు కారణాలతో పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అందించాలని అన్నారు.

ఈ మేరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ఈ నెల 31నే బ్యాంక్ నుంచి నగదు విత్ డ్రా చేసుకొని దగ్గరపెట్టుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ దారులకు పెన్షన్ డబ్బు ఒకటో తేదీన అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. గతంలో జరిగిన తప్పులను ఈసారి జరగకుండా.. పెన్షన్ దారులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలని సూచించారు.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు