/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/minister-2.jpg)
AP Transport Minister Wife Behavior : ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) భార్య హరితా రెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు కానీ, ఆమె మాట్లాడిన విధానం గురించి సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఆమె రాయచోటి (Rayachoty) లో తనకు పోలీసులు ఎస్కార్ట్ గా రావాలని, పోలీసుల కోసం ఎంత సేపు వేచి చూడాలని ఆమె ఓ పోలీసు అధికారి పై విరుచుకుపడ్డారు.
ఈ విషయం గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన విధానం సరికాదని పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు, ఇతర ఉద్యోగుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మెలగాలని, ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తే సహించలేది లేదని బాబు స్పష్టం చేశారు.
కాగా, ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. తన భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటానని తెలిపారు.
Also read: 7 రాష్ట్రాలకు కుండపోత వర్షాలు…రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణశాఖ!