/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Chandrababu-Naidu-jpg.webp)
Chandrababu: రాష్ట్రంలో దొంగ ఓట్లకు తెరతీసింది వైసిపీనే అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఓటర్ లిస్ట్ అనేది ఎన్నికల అధికారి తయారు చేస్తారు కానీ, నేడు ఏపీ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ వైసీపీనే తయారు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు గల్లంతు చేస్తున్నారని మండిపడుతున్నారు. తిరుపతి కలెక్టర్, ఎస్పీకు ఎన్నికల సంఘం చివాట్లు పెట్టినా లాభం లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు.
Also Read: బుద్ధిలేని హీనులే ఇలా చేస్తారు.. జగన్ కు మోహన్ బాబు కౌంటర్
చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పులివర్తి నానీ దొంగ ఓట్లపై గత ఆరు నెలల నుండి పోరాటం చేస్తున్నాడని తెలిపారు. ఏపీలో అరచక పాలన రాజ్యం ఏళుతుందని ధ్వజమెత్తారు. తుమ్మలగుంటలో 4 బూతులను ఏడుగా మార్చారని.. 25 వేల దొంగ ఓట్లను కొత్తగా నమోదు చేశారని దుయ్యబట్టారు. ఇలా దొంగ ఓట్ల ద్వారానే అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని కామెంట్స్ చేశారు.
Also Read: రగిలిపోతున్న అనామిక.. శోభనం క్యాన్సిల్.. కావ్యే కారణమంటూ నిందలు
తిరుపతి నియోజకవర్గంలో వున్న ఓట్లు చంద్రగిరిలో సైతం నమోదు అవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆర్. ఓ లాగిన్స్ తీసుకొని దొంగ ఓట్లు చేర్చే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యనించారు. వైసీపీ నేతలు ఉగ్రవాదుల కంటే మోసంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సచ్చివాలయం సిబ్బందిని ఉపయోగించి ఎన్నికలలో మోసాలకి పాల్పడే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత నీచమైన దొంగ ఎన్నికల ప్రయత్నాలు చూడలేదని పేర్కొన్నారు.