/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/sklm-jpg.webp)
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల టీడీపీలో అసంతృప్తి కనిపిస్తుంది. శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గుండ లక్ష్మీదేవికి కాదని పార్టీ అధిష్టానం టికెట్ ను గొండు శంకర్ కి కేటాయించింది. అటు, పాతపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ కలమట వెంకటరమణ కాదని మామిడి గోవిందకు టికెట్ ఇవ్వడంతో గుండ, కలమటలు అలక పూనినట్లు తెలుస్తోంది.
Also Read: మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత.. హనుమాన్ భక్తులు ఆందోళన..!
దీంతో, పలాసలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు వారిద్దరికి పిలుపునిచ్చారు. అయితే, చంద్రబాబును పలాసలో కలిసేందుకు గుండ లక్ష్మీదేవి, అప్పలసూర్యనారాయణ దంపతులు విచ్చేసిన.. కబురు ఆలస్యంగా రావడంతో చంద్రబాబును కలిసేందుకు కలమట వెంకటరమణ సుముఖత చూపారని సమాచారం. చంద్రబాబు పిలుపుతో సమస్య సద్దు మనిగేనా లేదంటే పార్టీ నుండి బయటకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.