Janasena BJP alliance: జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు.. పవన్‌ క్యాడర్‌లో టెన్షన్!

పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారని.. తమ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. పొత్తులపై పవన్ ప్రకటనతో పాటు ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తమది ప్రాంతీయ పార్టీ కాదు అని జాతీయ పార్టీ అంటూ కామెంట్స్ చేశారు.

Janasena BJP alliance: జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు.. పవన్‌ క్యాడర్‌లో టెన్షన్!
New Update

Jansena BJP alliance: ఏపీలో రాజకీయాలు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. అధికార వైసీపీ సంగతి పక్కనపెడితే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా జగన్‌ సర్కార్‌ని గద్దె దింపడమే టార్గెట్‌గా పెట్టుకున్న జనసేన, టీడీపీ పార్టీలు పొత్తుల విషయంలో క్యాడర్‌ని అయోమయానికి గురి చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఓవైపు బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. కమలం పార్టీ పెద్దల అనుమతి లేకుండానే టీడీపీతో కలిసి ముందుకు వెళ్తామని ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఏపీ స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం.. ఈ మాజీ సీఎంని రాజమండ్రి జైల్లో పవన్‌ కళ్యాణ్‌ కలవడం.. వెంటనే టీడీపీతో కలిసి పని చేస్తామని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం పవన్‌ వారాహి యాత్రలో ఉన్నారు. నిన్ననే మచిలీపట్నం టీడీపీ నేతలతో మీటింగ్‌ పెట్టారు. బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా టీడీపీకి మాత్రం సపోర్ట్ ఉంటుందని తెలుగుదేశం నేతలతో పవన్‌ చెప్పారు. ఇక జరుగుతున్న పరిణామాలపై ఆచితూచీ మాట్లాడుతూ వస్తోన్న ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పురంధేశ్వరి ఏం అన్నారంటే:

➼ పవన్ చేసే ప్రతి కామెంటుపై నేను స్పందించాల్సిన అవసరం లేదు.

➼ పొత్తులపై పవన్ ప్రకటన.. ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం.

➼ పొత్తులు.. పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తాం.

➼ ప్రస్తుతం పవనుతో పొత్తు కొనసాగుతుందా..? లేదా..? అనే అంశం పైనా జాతీయ నాయకత్వమే చెప్పాలి.

➼ పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు.. మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుంది.

➼ మాది ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ.

➼ ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా సేవా పక్షోత్సవాల ఎలా జరిగాయనే అంశంపై విశ్లేషించుకున్నాం.

➼ మండల ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశాం.

➼ త్వరలో రాష్ట్ర కార్యవర్గం జరుగుతుంది.. జేపీ నడ్డా హాజరు కానున్నారు.

➼ మద్యం మీద, గ్రామ పంచాయతీ రాజ్ సంస్థల నిధుల మళ్లింపుపై ఆందోళనలు చేపట్టాం.

➼ కేంద్ర బృందం వచ్చి.. నిధుల మళ్లింపుపై విచారణ చేపట్టింది.

➼ ఏపీలో స్థానిక సంస్థల నిధుల మళ్లింపు జరిగిందని కేంద్ర బృందం నిర్దారణకు వచ్చింది.

➼ నాణ్యత లేని మద్యం వల్ల లివర్ సిరోసిస్ వ్యాధి పెరిగిందని.. కేజీహెచ్ వైద్యులు స్పష్టం చేశారు.

నెక్ట్స్ ఏం జరగబోతోంది?
పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యల బట్టి జనసేనతో పొత్తు నిర్ణయం అల్టిమేట్‌గా హైకమాండ్‌దేనని స్పష్టం అవుతోంది. ఓవైపు పవన్‌ సైతం బీజేపీ తమతో వస్తుందా రాదా అన్న విషయాన్ని లైట్‌ తీసుకుంటున్నట్టు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు బీజేపీ హైకమాండ్‌ చంద్రబాబు ఎపిసోడ్‌లో అసలేమీ పట్టనట్టే కనిపిస్తోంది. అసలు రియాక్ట్ అవ్వడం లేదు. ఇక బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడీపీతోనే కలిసి పనిచెస్తామని పవన్‌ చెప్పినట్టు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కామెంట్స్ చేశారు. పొత్తుపై బిజెపి స్పందించేంత వరకు టిడిపి, జనసేన కలిసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎండగడతుందని చెప్పారు. అంటే జనసేన, టీడీపీ పొత్తు విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. ఇదే సమయంలో జాతీయ నాయకత్వమే పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ALSO READ: ‘బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడీపీతోనే’.. పవన్‌ ఏం అన్నారంటే?

#pawan-kalyan #chandrababu-arrest #daggubati-purandeswari
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe