చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా పడింది. కస్టడీ పిటిషన్ పై తీర్పును రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతోంది సీఐడీ. మూడు గంటల పాటు వాదనలు సాగగా.. 371 కోట్ల దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు పొన్నవోలు. సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందని కస్టడీని అడ్డుకుంటున్నారంటున్నారు సీఐడీ తరుఫున వాదించారు పొన్నవోలు.
చంద్రబాబుకు కలిసి రావడంలేదు:
దేశంలోనే టాప్ లాయర్లను పెట్టుకున్నా చంద్రబాబుకు ఏదీ కలిసి రావడంలేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో నిన్న(సెప్టెంబర్ 19) హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది, ఇందులో టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడును ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. కోర్టు తీర్పును రేపటికి(సెప్టెంబర్ 21) పోస్ట్ పోన్ చేసింది. తనపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన పిటిషన్‌కు సంబంధించిన వాదనలు సుమారు నాలుగున్నర గంటల పాటు విన్నారు. రాష్ట్రం తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్, అడ్వకేట్ రంజిత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ అడిషనల్ జనరల్ పి సుధాకర్ రెడ్డి వాదించగా, చంద్రబాబు నాయుడు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించారు.
తనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన అవినీతి నిరోధక శాఖ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాస్ రెడ్డి విచారించారు. చంద్రబాబు తన అభ్యర్ధనలో, CID నిర్దేశించిన విధానాన్ని (అవినీతి నిరోధక చట్టం (PC చట్టం) 2018 సెక్షన్ 17 (A) (c) 2018) కస్టడీలోకి తీసుకునేటప్పుడు అనుసరించలేదని చెప్పారు. చట్టం ప్రకారం.. ప్రభుత్వోద్యోగి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ముందస్తుగా గవర్నర్ అనుమతి లేకుండా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయకూడదు. విచారణకు అరగంట ముందు మాత్రమే రాష్ట్ర తరపు న్యాయవాది కౌంటర్ సమర్పించారని నాయుడు తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో చంద్రబాబుకు సంబంధించి రెండు పిటిషన్‌లపై రేపే తీర్పు రానుంది. బెయిల్ పిటిషన్‌పైనా రేపు తీర్పు రానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది
ALSO READ: బీజేపీలో రాములమ్మ బాంబ్.. కమలంలో టెన్షన్ టెన్షన్..!