/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-35-4.jpg)
Yevam Teaser: యంగ్ బ్యూటీ చాందిని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వరుస హిట్లతో దూసుకుపోతుంది. రీసెంట్ గా గామి చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ త్వరలో మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాటిలో ఒకటి 'యేవమ్'.
'యేవమ్'
క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రకాష్ దంతులూరి తెరకెక్కించారు. హీరో నవదీప్ (Hero Navdeep) సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ చాందిని చౌదరి (Chandini Chowdary) ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా.. వశిష్ట సింహా, భరత్ రాజ్, అషురెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ గ్లిమ్ప్స్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
‘యేవమ్’ టీజర్
తాజాగా విడుదలైన ‘యేవమ్’ టీజర్ ఆసక్తికర థ్రిల్లింగ్ అంశాలతో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఈ టీజర్ ను తెలంగాణ ఒగ్గు కథ స్టైల్ లో కట్ చేశారు మేకర్స్. బ్యాక్ గ్రౌండ్ లో చెబుతున్న ఒగ్గు కథకు తగ్గట్లుగా కథ జరుగుతున్నట్లుగా చూపించారు. టీజర్ లో చూపిన ప్రకారం.. అమ్మాయిలంటే పిచ్చితో ఉన్న విలన్ ఎలాగైనా వారిని దక్కించుకోవాలని అనుకుంటాడు. ఇష్టపడిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఎంతటి ఘోరానికైనా సిద్దపడే మస్తత్వం అతనిది అన్నట్లుగా చూపించారు. మరో వైపు ఆ ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇక అదే సమయంలో పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన చాందిని.. హత్యల వెనుక మిస్టరీ ఎలా ఛేదించింది..? ఆ విలన్ కు హత్యలకు ఏదైన సంబంధం ఉందా..? అనేది సినిమా కథ అన్నట్లుగా తెలుస్తోంది.
Presenting the intriguing #YevamTeaser to you all!
🔗 https://t.co/ga1rG6yf9lComing soon to theatres near you!#Yevam #YevamMovie @YevamMovie
🌟 @iChandiniC @ImSimhaa @AashuReddy99 @BharatRaj0921
Directed by: @prakash_d
Produced by: @pnavdeep26 @pavangoparaju pic.twitter.com/tb5R9EQV0d— Chandini Chowdary (@iChandiniC) May 24, 2024
Pushpa 2: పుష్ప లవర్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఐటెమ్ సాంగ్‌లో ఎవరంటే? - Rtvlive.com