/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T165608.465.jpg)
Yevam Trailer: ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి ప్రధాన పాత్రలో రాబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'యేవమ్'. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, టీజర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం జూన్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
'యేవమ్' ట్రైలర్
ట్రైలర్ చూస్తుంటే.. పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన హీరోయిన్ చాందిని.. అక్కడే తన పై ఆఫీసర్ గా పనిచేస్తున్న హీరో జైభారత్ తో ప్రేమలో పడుతుంది. డ్యూటీ చేస్తున్న క్రమంలోనే వీరిద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెడతారు. ఆ తర్వాత వీరికి ఒక పెద్ద మిస్టరీ కేసు ఎదురవుతుంది. ఒక గ్రామంలో వరుసగా అమ్మాయిలు హత్య చేయబడుతూ ఉంటారు. ఈ హత్యలకు కారణమేంటి..? హత్యలు చేస్తున్నది ఎవరు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
The intense and action-packed #Yevam Trailer is out now 🔥💥
- https://t.co/HXGmfcdpIk#Yevam in cinemas worldwide from June 14th!@YevamMovie #YevamMovie #YevamOnJune14th@iChandiniC @ImSimhaa @AashuReddy99 @BharatRaj0921 @prakash_d @pnavdeep26 @pavangoparaju pic.twitter.com/Hyye7BNSxs
— YevamMovie (@YevamMovie) June 6, 2024